ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జుర్రేరు శుద్ధి పనులు ప్రారంభం

ABN, Publish Date - Nov 29 , 2024 | 11:51 PM

బనగానపల్లె పట్టణ నడిబొడ్డున ఉన్న జుర్రేరువాగు శుద్ధి పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

జుర్రేరు వాగు శుద్ధి పనులు ప్రారంభిస్తున్న రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి

ఆక్రమణలు ప్రోత్సహించిన

మాజీ ఎమ్మెల్యే కాటసాని :మంత్రి బీసీ

బనగానపల్లె, నవంబరు 29(ఆంఽఽధ్రజ్యోతి): బనగానపల్లె పట్టణ నడిబొడ్డున ఉన్న జుర్రేరువాగు శుద్ధి పనులను రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వయంగా మంత్రి ఎక్స్‌కవేటర్‌ను కాసేపు నడిపి జుర్రేరువాగులో ముళ్లకంపలను తొలగించారు. అనంతరం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ మొదటి విడతగా రూ19.70 లక్షలతో జుర్రేరువాగులోని ముళ్లకంపలు, గుర్రపు డెక్కలు తొలగించి శుద్ధి కార్యక్రమం ఆరంభిస్తున్నట్లు తెలిపారు. వాగుకు ఇరువైపుల ఆక్రమణలను మొదటి దశలో తొలగించనున్నట్లు మంత్రి తెలిపారు. 5 ఏళ్ల క్రితం 2014-19 తెలుగుదేశం పార్టీ హయంలో నీరు చెట్టు పథకం కింద జర్రేరు వాగును పరిశుభ్రం చేసినట్లు తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జుర్రేరువాగును పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. స్వార్థ రాజకీయాల కోసం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి జుర్రేరువాగులో ఆక్రమణలు ప్రోత్సహించారని విమర్శించారు. అమాయకులైన కార్పెంటర్లకు మాయమాటలు చెప్పి జుర్రేరు వాగులో షెడ్లు వేయించారన్నారు. అనుమతి తీసుకోకుండా ఓ ఫంక్షన్‌ హాల్‌కు దారి కోసం దాని యజమాని వాగును ఆక్రమించి రోడ్డును నిర్మించుకున్నారన్నారు. ఇలాంటి ఆక్రమణలను తొలగిస్తామన్నారు. రెండో విడతలో మురుగునీరు జుర్రేరులో కలవకుండా జుర్రేరువాగునుంచి బ్రహ్మంగారి మఠం వరకు మురుగునీటి కోసం ప్రత్యేక ప్రణాళికలతో శుద్ధి చేసి వాటిని బ్రహ్మంగారి మఠం వద్ద కలిసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి బీసీ తెలిపారు. అలాగే పట్టణంలో ప్లాస్టిక్‌ నివారణకు తన సతీమణి ఇందిరమ్మ కృషి చేస్తోందని, అందుకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో మైనర్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఈఈ రఘురామిరెడ్డి, డీఈ నాగన్న, ఏఈ రామ్మోహన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ డీఈ నాగశ్రీనివాసులు, తహసీల్దారు నారాయణరెడ్డి, అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 11:51 PM