వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా కప్పట్రాళ్ల బొజ్జమ్మ
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:37 PM
రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలానికి చెందిన టీడీపీ నాయకురాలు కప్పట్రాళ్ల బొజ్జ మ్మ శుక్రవారం విజయవాడలోని బీసీ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు.
ఆలూరు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్‌గా ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలానికి చెందిన టీడీపీ నాయకురాలు కప్పట్రాళ్ల బొజ్జ మ్మ శుక్రవారం విజయవాడలోని బీసీ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె వాల్మీకి వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. నిరుద్యోగ యువత జీవనోపాధి కోసం రుణాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. తనకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేశ్, టీజీ భారత్, ఎంపీ బస్తిపాటి నాగరాజుకు, టీడీపీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం బొజ్జమ్మతో పాటు టీడీపీ నాయకుడు రామచంద్రనాయుడు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు టీడీ జనార్ధన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Updated Date - Nov 29 , 2024 | 11:37 PM