ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో కార్తీక పూజలు

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:26 PM

శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

నీటిలో దీపాలు వదులుతున్న మహిళలు

శ్రీశైలం, నవంబరు 14(ఆంధ్రజోతి): శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకకువజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఆలయ ఉత్తర మాఢవీధి ప్రాంగణం వద్ద, దేవాలయం ఎదురుగా ఉన్న గంగాధర మండపం వద్ద పెద్ద ఎత్తున దీపారాధనలను చేశారు. అదేవిధంగా కొంతమంది భక్తులు లక్ష వొత్తుల నోములను నోచుకున్నారు. సాయంత్రం ఆలయ ధ్వజస్తంభం వద్ద ఆకాశ దీపం వెలిగించారు. భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారం రోజులలో స్వామివారి అలంకరణ దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. శ్రీశైలం క్షేత్రంలో గురువారం మల్లికార్జునస్వామి ఆలయ ప్రాంగణంలోని త్రిఫలవృక్షం వద్ద దత్తాత్రేయ స్వామివారికి విశేష పూజలను దేవస్థానం నిర్వహించింది.

నేడు పుణ్యనదీ హారతి, జ్వాలాతోరణం

నేడు పౌర్ణమి ఘడియలు పురస్కరించుకొని శుక్రవారం సాయంత్రం పాతాళగంగలో పుణ్యనదీ హారతి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ ముందు భాగంలో ఉన్న గంగాధర మండపం వద్ద సాయంత్రం జ్వాలాతోరణం, లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలను నిర్వహించనుంది.

Updated Date - Nov 14 , 2024 | 11:26 PM