ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జ్ఞాన భాండాగారం..గ్రంథాలయం

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:35 PM

స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఉద్యమ కారులకు సమాచార కేంద్రాలుగా ఉంటూ అక్షరాస్యత సాధనలో ప్రముఖ పాత్ర పోషిం చిన ఘనత గ్రంథాలయానికే చెందు తుంది. నేటి ఆధునిక కాలంలోనూ పాఠకులకు విస్తృత స్థాయిలో సేవలందిస్తున్న ఈ పఠనాలయాలను గుర్తిస్తూ ఏటా నవంబరు 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు

నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం

పాఠకులకు విస్తృత స్థాయిలో సేవలు

నేటి నుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

కర్నూలు కల్చరల్‌/కొలిమిగుండ్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో ఉద్యమ కారులకు సమాచార కేంద్రాలుగా ఉంటూ అక్షరాస్యత సాధనలో ప్రముఖ పాత్ర పోషిం చిన ఘనత గ్రంథాలయానికే చెందు తుంది. నేటి ఆధునిక కాలంలోనూ పాఠకులకు విస్తృత స్థాయిలో సేవలందిస్తున్న ఈ పఠనాలయాలను గుర్తిస్తూ ఏటా నవంబరు 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పత్తికొం డ, నంద్యాల, చాగలమర్రి తదితర ప్రాంతాల్లో నాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని రగిల్చడంలో గ్రంథాలయాలు ప్రముఖంగా నిలిచాయి. స్వాతంత్ర్యానంతరం కర్నూలు నగరంలోని పాతనగరం గడియారం ఆసుపత్రి వద్ద గ్రంథాలయ సంస్థను, జిల్లా కేంద్ర గ్రంథాల యాన్ని 1959లో స్థాపించారు. వీటిని ఆనాడు ఎల్‌ఎల్‌ఏ (లోకల్‌ లైబ్రరీ అథారిటీ) సంస్థ నిర్వహించేది. కాగా 1972లో ప్రస్తుతం చిదంబరరావు వీధిలో ఉన్న సొంత భవనం లోకి మార్చారు. ఎల్‌ఎల్‌ఏ నుంచి గ్రంథాల యాలను రాష్ట్ర పౌర గ్రంథాలయ సంస్థ పరిధిలోకి చేర్చారు. అనంతరం జిల్లా గ్రంథాలయ సంస్థగా పేరు మారింది. గత 64 ఏళ్లుగా జిల్లా కేంద్ర గ్రంథాలయం పాఠకులకు విస్తృత సేవలందిస్తోంది. గురువారం నుంచి 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఉమ్మడి జిల్లాలో గ్రంథాలయ సంస్థ అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం.

నిరుద్యోగుల పోటీ పరీక్షలకు..

జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగ యువత వివిధ పోటీ పరీక్షలు రాసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచారు. పుస్తక పఠనం కోసం ఏసీ స్టడీ హాలు అందుబాటులో ఉండగా సుమారు వందమంది కూర్చొని చదువ ుకునే అవకాశం లైబ్రరీలో ఉంది. స్టడీ హాలులో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు నిరుద్యోగులు చదువుకునే ఏర్పాటు చేశారు. పాఠకుల సౌకర్యార్థం జిల్లా కేంద్రంతోపాటు కోవెలకుంట్ల, ఆళ్లగడ్డ, గోస్పాడు, ఆదోని, పాణ్యం, ఆలూరు, దొర్నిపాడు, నంద్యాల, డోన్‌, నందికొట్కూరు శాఖా గ్రంథాలయాల్లో అంతర్జాల సౌకర్యం కల్పించారు.

అందుబాటులో లక్షలాది పుస్తకాలు,

జిల్లా కేంద్రంలోని సెంట్రల్‌ లైబ్రరీతో కలుపుకొని 58 శాఖా గ్రంథాలయాలు, 1 గ్రామీణ గ్రంథాలయం, 133 పుస్తక నిక్షిప్త కేంద్రాలు (బీడీసీ)లతో సేవలు అందిస్తున్నాయి. తెలుగు, హిందీ, ఆంగ్లం, ఉర్దూ ఇతర భాషలకు సంబంధించిన 55,169 పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉంటు న్నాయి. ఒక్క జిల్లా కేంద్రంలోనే పత్రికలు, రెఫరెన్స్‌, లెండింగ్‌ (పుస్తకాలు ఇంటికి ఇవ్వడం), ఇంటర్‌నెట్‌, సెర్చ్‌, స్టడీల్యాబ్‌ వంటి ఆరు విభాగాల్లో సేవలు అందిస్తోంది. జిల్లాలో 21 శాఖా గ్రంథాలయాలు సొంత భవనాల్లో కొనసాగుతుండగా, 22 అద్దె ప్రాతిపదికన, 17 రెంట్‌ ఫ్రీ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి.

నేటి నుంచి వారోత్సవాలు

కర్నూలు జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గురువారం ఉదయం 10 గంటలకు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జాయింట్‌ కలెక్టర్‌ నవ్య వారోత్సవాలు ప్రారంభిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 58 శాఖా గ్రంథాలయాల్లో గ్రంథాలయ వారోత్సవాలు గురువారం నుంచి ఆరంభిస్తున్నారు. ఈనెల 20 వరకు జరిగే ఈ వారోత్సవాల్లో 14న బాలల దినోత్సవం, 15న పుస్తక ప్రదర్శనలు, అవగాహన సదస్సు, 16న గ్రంథాలయ యోధులపై ప్రముఖుల ప్రసంగాలు, 17న కవి సమ్మేళనం, సదస్సులు, రచయితల అభిప్రాయాలు, 18న విద్యార్థులకు ప్రతిభా పోటీలు, ఆటల పోటీలు, 19న మహిళలకు విభిన్న రకాల పోటీలు, 20న డిజిటల్‌ గ్రాంథాలయాలపై అవగాహన, సామూహిక స్వీయ పఠనం, బహుమతుల ప్రదానం, ముగింపు వేడుకలు నిర్వహిస్తున్నారు.

గ్రంథాలయ సెస్‌ నిధులు విడుదల చేస్తే మరిన్ని సేవలు

జిల్లా గ్రంథాలయ సంస్థకు నగరపాలక సంస్థ, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి రావాల్సిన సెస్‌ నిధులు 13 కోట్లకు పైగా ఉన్నాయి. గ్రంథాలయ సంస్థ రుసుము కింద గ్రామ, నగర పంచాయితీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు సెస్‌ వసూలు చేస్తున్నా యి. కానీ ఈ నిథులు గ్రంథాలయ సంస్థకు అందజేయడం లేదు. ఒక్క కర్నూలు నగరపాలక సంస్థ నుంచి రూ. 7.73 కోట్లు రావాల్సి ఉంది. అధికారులు గ్రంథాలయాల పురోభివృద్ధిపై దృష్టి పెట్టి లైబ్రరీ సెస్‌ నిధులు విడుదల చేయాలని కోరుతున్నాం. - కె.ప్రకాశ్‌, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయ సంస్థ, కర్నూలు

Updated Date - Nov 13 , 2024 | 11:35 PM