ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

శ్రీశైలంలో లక్ష దీపోత్సవం

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:46 AM

ద్వాదశ జ్యోతిర్లిం గాల్లో ఒక్కటైన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి

పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం

శ్రీశైలం, నవంబరు 11(ఆంధ్రజోతి): ద్వాదశ జ్యోతిర్లిం గాల్లో ఒక్కటైన శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం రెండో సోమవా రాన్ని పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్స వం, పుష్కరిణికి దశవిధ హారతులను దేవస్థానం వైభవంగా నిర్వహించింది. సోమవారం భక్తులు భారీగా తరలిరావడంతో క్షేత్ర వీధులు రద్దీగా కనిపించాయి. భ్రమరాంబ మల్లికార్జు న స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విశేషంగా తరలిరావడంతో క్షేత్రం శివనామ స్మరణతో మార్మోగింది. వేకువ జాము నుంచే పాతాళగంగలో అధిక సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, దీపారాధనలు చేశారు. స్వామి అమ్మవార్ల దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. కాగా ప్రధాన ఆలయం ఎదుట గల గంగాధర మంటపం వద్ద మహిళలు దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం ధ్వజ స్తంభానికి ఆకాశ దీపం నిర్వహించారు. ఏర్పాట్లను ఆలయ ఈఓ చంద్రశేఖర్‌ రెడ్డి పర్యవేక్షించారు.

Updated Date - Nov 12 , 2024 | 12:46 AM