ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Leopard Roaming: మహానందిలో చిరుతపులి సంచారం కలకలం..

ABN, Publish Date - Dec 15 , 2024 | 08:55 AM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో పులుల సంచారం కలకలం రేపుతోంది. తాజాగా మహానంది మండలం, ఎంపీ ఫారమ్ గ్రామ సమీపంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మహానందికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు బస్సులో వెళుతుండగా మర్గమధ్యలో చిరుతపులి కనిపించింది.

కర్నూలు జిల్లా: మహానంది మండలం (Mahanandi Mandalam), ఎంపీ ఫారమ్ గ్రామ (MP Form Village) సమీపంలో చిరుతపులి సంచారం (Leopard Roaming) కలకలం రేపింది. మహానందికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు బస్సులో వెళుతుండగా మర్గమధ్యలో చిరుతపులి కనిపించింది. ఎంపీ ఫారమ్ గ్రామ సమీపంలో పులిని చిత్రీకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో చిరుతపులి రోడ్డు దాటుతూ ఓ పొలంలోకి వెళ్లింది. వెంటనే చిరుతపులి సంచారంపై అటవీ అధికారులకు సమాచారం అందించారు. కాగా మహానంది ఆలయ దర్శనం వేళల్లో అధికారులు మార్పు చేశారు. మధ్యాహ్నం 12:30 గంటల నుండి రెండు గంటల వరకు విరామం ప్రకటించారు.


భయాందోళనలో ప్రజలు..

కాగా వరుస దాడులతో సమీప గ్రామాల ప్రజలు హడలి పోతున్నారు. మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ వైపు పెద్దపులులు వస్తున్నాయి. వాటి జాడ గుర్తించేందుకు అధికారులు డ్రోన్లు ఏర్పాటు చేసి ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అటవీ ప్రాంత శివారు గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. పెద్దపులులు, చిరుతలు దాడి చేస్తుండటంతో ఎప్పుడేం జరుగుతోందోనని ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్‌, ములుగు జిల్లాల్లో వరుసగా వెలుగు చూస్తున్న పులి దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్‌ అటవీ ప్రాంతాల నుంచి పులులు, చిరుతలు ఇతర అడవి జంతువులు తెలంగాణ అటవీ ప్రాంతాల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్‌, తాడోబా అభయారణ్యం నుంచి పెద్ద పులులు తెలంగాణవైపునకు వస్తున్నాయి. నవంబరు నుంచి ఫిబ్రవరి వరకు జత కట్టే సమయం కావడంతో తెలంగాణ వైపు పెద్ద పులుల రాక ఇటీవల కాలంలో మరింతగా పెరిగింది. ఈ క్రమంలోనే అవి పశువులు, మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రోజుల వ్యవధిలోనే పులి దాడులు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందింది.

ఆసిఫాబాద్‌ జిల్లాలో లక్ష్మి అనే మహిళపై పెద్ద పులి దాడి చేసి ప్రాణాలు తీసింది. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే దుబ్బగూడెంలో పొలం పనుల్లో ఉన్న రైతు సురేశ్‌పై పులి దాడి చేసి గాయపరిచింది. కొద్ది రోజుల క్రితం తిప్పేశ్వర్‌ ఆభయారణ్యం నుంచి వచ్చిన పెద్దపులి నిర్మల్‌ జిల్లాలో అలజడి సృష్టించింది. బోధ్‌ మీదుగా సారంగపూర్‌ అటవీ ప్రాంతంలోకి వచ్చింది. సమీప ప్రాంతాల్లో సంచరించి తిరిగి మహారాష్ట్రవైపు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. బోధ్‌ మండలంలోనూ చిరుత సంచారం హడలెత్తిస్తోంది. మేకల మందపై చిరుత దాడి చేసింది. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లాలోని డెడ్రా గ్రామంలో చిరుత పులి మహిళపై దాడి చేసింది. కొద్ది రోజుల క్రితం చత్తీ్‌సగఢ్‌ అటవీ ప్రాంతం నుంచి వచ్చిన పులి ములుగు జిల్లా అటవీ ప్రాంతంలో సంచరించింది. గతంలోనూ పులులు, చిరుతల దాడుల్లో పలువురు అటవీ సమీప ఆవాస ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పులులు, చిరుతలు, ఇతర అడవి జంతువుల దాడుల్లో తరచూ ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం, తీవ్రంగా గాయపర్చడంతోపాటు పశువుల మందలపైనా దాడులు చేసి నోటకరుచుకుని వెళ్తున్నాయి.


జాగ్రత్తలు చేపట్టిన అటవీ శాఖ

అటవీ సమీప ప్రాంతాల్లో వణ్య ప్రాణుల దాడులుపెరిగిన నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పులి జాడలు గుర్తించేందుకు ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు ఇటీవలే హైదరాబాద్‌ అటవీ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి అత్యాధునిక థర్మల్‌ డ్రోన్‌లను తరలించారు. పగలు, రాత్రి వేళల్లోనూ డ్రోన్లను ఉపయోగించి పులి జాడ తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అవసరమైన ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. జత కోసం తిరుగుతున్న పులి బారినపడకుండా ఉండేందుకు కొంత కాలం పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే ప్రజలు పొలం పనులకు వెళ్లాలని సూచిస్తున్నారు. విజిల్స్‌, మాస్క్‌లు అందిస్తున్నారు. ఒంటరిగా కాకుండా గుంపులు గుంపులుగా తిరగాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అల్లు అర్జున్ ఇంటికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

పాలకొల్లులో సేవ్ గర్ల్ చైల్ఢ్ కార్యక్రమం

జగిత్యాలలో ఆదివారం ఎమ్మెల్సీ కవిత పర్యటన

చంద్రబాబు: నాడు, నేడు, రేపు..

ఆస్తి కోసం కన్నవారిని కడతేర్చాడు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 15 , 2024 | 08:56 AM