ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం
ABN, Publish Date - Nov 19 , 2024 | 11:32 PM
ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకుని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ పి. రంజిత్ బాషా
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకుని ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘మన మరుగుదొడ్డి.. మన గౌరవం’ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సర్పంచులు సవాలుగా తీసుకుని గ్రామాల్లో అన్ని ఇళ్లకు మరుగుదొడ్ల నిర్మాణాలకు కృషి చేయాలన్నారు. జిల్లాలో 5,284 మరుగుదొడ్ల నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు ఇచ్చామని, వాటిని డిసెంబరు 10లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మరో 12,481 మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరలో చేపడతామని అన్నారు. అనంతరం పసుపల సర్పంచ్ శీలమ్మ, తడకనపల్లి సర్పంచ్ షేకూన్‌బీ, పసుపుల గ్రామ పారిశుధ్య కార్మికులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నాసరరెడ్డి, ఎస్‌సీ ఆర్‌డబ్ల్యూఎస్ నాగేశ్వరరావు, నగర పాలక కమిషనర్ రవీంద్రబాబు, డీపీఓ భాస్కర్ పాల్గొన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 11:32 PM