ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ర్యాగింగ్‌తో జీవితాలు నాశనం

ABN, Publish Date - Oct 20 , 2024 | 12:10 AM

ర్యాగింగ్‌కు పాల్పడితే జివితాలు నాశనం అవుతాయని ఎస్పీ బిందుమాధవ్‌ వైద్య విద్యార్థులకు సూచించారు.

మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ్‌

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 19, (ఆంధ్రజ్యోతి): ర్యాగింగ్‌కు పాల్పడితే జివితాలు నాశనం అవుతాయని ఎస్పీ బిందుమాధవ్‌ వైద్య విద్యార్థులకు సూచించారు. శనివారం కర్నూలు మెడికల్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ కె.చిట్టినరసమ్మ అధ్యక్షతన ర్యాగింగ్‌ నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ ర్యాగింగ్‌ పేరుతో సీనియర్లు వేధించకూడదన్నారు. హనీట్రాప్‌, బెదిరింపు ఫోన్‌కాల్స్‌, లోన్లు, డ్రగ్స్‌ వీటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్‌లో యాప్‌ల ద్వారా లోన్లు తీసుకుని ఇబ్బందులు పడవద్దని హెచ్చరించారు. ర్యాగింగ్‌ జరిగినట్లు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వ్యక్తుల గౌరవం, ప్రతిష్ఠను భంగం కలిగించేలా వ్యవహరించడం చట్టప్రకారం నేరమన్నారు. జిల్లా లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీ బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ వైద్య విద్యార్థులు ఐదేళ్లు బాధ్యతగా ఉండాలని ప్రతి ఒక్కరూ తమ తల్లిదండ్రుల ఆశయ సాధన కోసం కృషి చేసి ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ర్యాగింగ్‌ చిన్నదైనా అందులో సెక్షన్లు, శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సి.ప్రభాకర్‌ రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ హరిచరణ్‌, వైద్యులు సాయిసుధీర్‌, రేణుకాదేవి, విజయానందబాబు, లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌ మెంబర్‌ మనోహర్‌, హాస్టల్‌ వార్డెన్లు మాదవీ శ్యామల, నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 12:10 AM