ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చవితి సందడి

ABN, Publish Date - Sep 07 , 2024 | 01:24 AM

వినాయక చవితి పండుగను పురస్కరిం చుకుని బేతంచెర్ల పట్టణంలోని పాత బస్టాండులో సందడి నెలకొంది.

చాగలమర్రిలో ముస్తాబైన వినాయక మండపం

పూజా సామగ్రి కొనుగోళ్లకు డిమాండ్‌

ముస్తాబైన వినాయక మండపాలు

బేతంచెర్ల, సెప్టెంబరు 6: వినాయక చవితి పండుగను పురస్కరిం చుకుని బేతంచెర్ల పట్టణంలోని పాత బస్టాండులో సందడి నెలకొంది. శనివారం వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకునికి సమర్పించే పూజా సామగ్రిని పాతబస్టాండులో కొనుగోలు చేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. పట్టణంలో గణేశ ఉత్సవ మండలి కమిటీలు విగ్రహాల ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేసినట్లు మండపాల నిర్వాహకులు తెలిపారు.

ఆళ్లగడ్డ: వినాయక చవితి నాడు గణనాథులను ప్రతిష్ఠించేందుకు నిర్వాహకులు ట్రాక్టర్లలో శుక్రవారం తరలించారు. ఆళ్లగడ్డ పట్టణం, చుట్టు ప్రక్కల గ్రామాల్లో ప్రతిష్టించేందుకు సుమారు 500 విగ్రహాలను తరలిం చా రు. ఇదిఇలా ఉండగా గణేశ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ రవికుమార్‌ నిర్వాహకులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణలో పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు.

చాగలమర్రి: మండలంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఆయా గ్రామాల్లో వినాయక విగ్రహాలను కొలువుదీరేందుకు మండపాలను సిద్ధం చేశారు. ఆళ్లగడ్డ, మైదు కూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి వినా యక విగ్రహాలను కొనుగోలు చేసి చాగలమర్రికి తరలించారు. అయ్యప్ప ఆలయంలో విగ్రహాలను ఉంచారు. శనివారం ఆయా విగ్రహాలను వీధుల గుండా ఊరేగింపు చేసి మండపాలలో కొలువు దీరుస్తారని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు గుత్తి నరసింహులు తెలిపారు. విగ్రహాల వద్ద కమిటీ సభ్యులదే బాధ్యతని, ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని ఆళ్లగడ్డ రూరల్‌ ఎస్‌ఐ హరిప్రసాద్‌ సూచించారు.

కొలిమిగుండ్ల: వినాయక చవితి ఉత్సవాలకు వివిధ ఆకృతులలో గణపయ్య ప్రతి మల ప్రతిష్ఠకు ఉత్సవ కమిటీ సభ్యులు సర్వం సిద్ధం చేశారు. రంగురంగుల కాగితాలు, జిగేలు మనిపించే డేకరేషనలతో మండ పాలను చూడ ముచ్చటగా తీర్చిదిద్దారు.

కోవెలకుంట్ల: కోవెలకుంట్ల పట్టణంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు శుక్రవారం విగ్రహాలు కొనుగోలు చేసి ట్రాక్టరులో తీసుకువెళ్లారు. గ్రామంలో వినాయక విగ్రహాలు కొలువుదీ రనున్నాయి.

Updated Date - Sep 07 , 2024 | 01:24 AM

Advertising
Advertising