ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇటు లో వోల్టేజీ, అటు కోత

ABN, Publish Date - Nov 13 , 2024 | 11:45 PM

మండలంలో ఇటు విద్యుత్‌ కోత, అటు లో ఓల్టేజీ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.

మద్దికెరలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌

రైతులు, ప్రజల ఇబ్బంది

పనులు చేసుకోలేక అల్లాడుతున్న

చిరు వ్యాపారులు

మద్దికెర, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఇటు విద్యుత్‌ కోత, అటు లో ఓల్టేజీ సమస్యతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలో 8 పంచాయతీ లుండగా, 40వేల జనాభాచ దాదాపు 11వేలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. మద్దికెరలో విద్యుత్‌ ఉప కేంద్రాన్ని నిర్మించారు. అనధికార విద్యుత్‌ కోతలకు తోడు విద్యుత్‌ వినియోగం పెరిగి, ట్రాన్స్‌ఫారంపై లోడు పెరిగి, ట్రిప్‌ అవుతున్నాయి. మండల కేంద్రంలోని కురవ వీధి, గిడ్డయ్య వీధిలో టీవీలు, మోటర్లు కాలిపోయాయి. కొన్ని గ్రామాల్లో రాత్రి 10 గంటల వరకు లోవోల్టేజీ సమస్య ఉంది. పొలాలకు నీరు పెట్టే సమయం కావడంతో రైతులు అవస్థలు పడుతున్నారు. విద్యుత్‌ అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలో విద్యుత్‌ కోతలతో హోటళ్ల యజమానులు , చిరు వ్యాపారులు, జిరాక్స్‌ షాపుల వారు ఇబ్బంది పడుతున్నారు. విద్యుత్‌ అధికారులు స్పందించి విద్యుత్‌ కోతలు లేకుండా చూడాలని కోరుతున్నారు.

మరమ్మతులు చేస్తున్నందుకే..

విద్యుత్‌ మరమ్మతుల పనులు జరుగుతున్నందుకే విద్యుత్‌ సరఫరాలో అంతరాయం వస్తోంది. ఇకపై విద్యుత్‌ కోతలు లేకుండా చూస్తాం - మహ్మద్‌ రఫీ, విద్యుత్‌ ఏఈ

Updated Date - Nov 13 , 2024 | 11:45 PM