గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయండి
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:59 PM
గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదోని ఇనచార్జ్ సబ్ కలెక్టర్ చల్లా విశ్వనాథ్ పేర్కొన్నారు.
ఆదోని, ఆగస్టు 27: గణేష్ ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆదోని ఇనచార్జ్ సబ్ కలెక్టర్ చల్లా విశ్వనాథ్ పేర్కొన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 7న వినాయక చవితి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 11న నిమజ్జనం లో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. తాగునీరు, విధ్యుత, పారిశుధ్యం, ఇబ్బందులు రాకూడదన్నారు. రహదారుల గుంతలను పూడ్చాలని ఆర్అండ్బీ అధికారులకు ఆదేశించారు. క్రేన్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అసిస్టెంట్ కమిషనర్ అనుపమ, డీఎల్డీవో నాగేశ్వరరావు, మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ సీసీర దీప్తి, సర్కిల్ ఇనస్పెక్టర్ గంట సుబ్బారావు, డీటీ రుద్రగౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Aug 27 , 2024 | 11:59 PM