ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎండు మిర్చి ధర పైపైకి..

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:44 AM

కర్నూలు మార్కెట్‌ యార్డులో ఎండు మిర్చి ధర ఆకాశాన్నంటుతోంది. బుధవారం క్వింటా ఎండు మిర్చి ధర గరిష్ఠంగా 15,513, మధ్యస్థ ధర రూ.6,709, కనిష్ఠ ధర రూ.1,699ు రైతులకు లబించిందని మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు.

యార్డుకు అమ్మకానికి వచ్చిన ఎండుమిర్చి

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో ఎండు మిర్చి ధర ఆకాశాన్నంటుతోంది. వారం రోజులుగా రైతులు ఉమ్మడి కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున అమ్మకానికి తీసుకు వస్తున్నారు. బుధవారం క్వింటా ఎండు మిర్చి ధర గరిష్ఠంగా 15,513, మధ్యస్థ ధర రూ.6,709, కనిష్ఠ ధర రూ.1,699ు రైతులకు లబించిందని మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా మినుములకు గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధరలు క్వింటానికి రూ.8,321 రైతులకు అందిందని తెలిపారు. సజ్జకు గరిష్ఠ, మధ్యస్థంగా రూ.2,169, కనిష్ఠంగా రూ.2,091 లభించిందని, కొర్రలకు గరిష్ఠ ధర రూ.3,309, మధ్యస్థం రూ.2,511, కనిష్ఠం రూ.2,449 రైతులకు నిర్ణయించారని సెక్రటరీ తెలిపారు. వేరుశనగ కాయలకు గరిష్ఠ ధర రూ.6,189, మధ్యస్థ రూ.5,410, కనిష్ట ధర రూ.3,610 దక్కింది. ఆముదాలకు గరిష్ఠం రూ.5,706, మధ్యస్థ రూ.5,686, కనిష్టం రూ.5,190 నిర్ణయించారు. మొక్కజొన్నలకు గరిష్ఠ ధర రూ.2,246లు, మద్యస్తం రూ.2,159లు, కనిష్ఠం రూ.2,125లు దక్కింది. శనగలకు గరిష్ఠ, మధ్యస్థ, కనిష్ఠ ధర రూ.6,031 కాగా, ఉల్లి ధర వారం రోజులుగా తగ్గుతూ వస్తోంది. గరిష్ఠ ధర రూ.4,412, మధ్యస్థం రూ.3,891, కనిష్ఠం రూ.515 దక్కింది.

Updated Date - Nov 21 , 2024 | 12:45 AM