ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వెలుగొండ ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోట్ల

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:58 PM

ప్రకాశం జిల్లాలోని దోర్నాల వద్ద గల వెలుగొండ సాగు నీటి ప్రాజెక్టును శుక్రవారం డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సందర్శించారు.

డోన్‌, జూలై 26: ప్రకాశం జిల్లాలోని దోర్నాల వద్ద గల వెలుగొండ సాగు నీటి ప్రాజెక్టును శుక్రవారం డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి సందర్శించారు. వెలుగొండ ప్రాజెక్టులోని సొరంగాన్ని ఎమ్మెల్యే కోట్ల సందర్శించారు. వెలుగొండ ప్రాజెక్టు టన్నెల్‌-2 పనుల వివరాలను సంబంధిత ఇంజనీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల మాట్లాడుతూ సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే 3.24 లక్షల ఎకరాలకు సాగునీరు, 11 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారన్నారు. డోన్‌ నియోజకవర్గంలోని చెరు వులకు హంద్రీనీవా ప్రాజెక్టు నీరు నింపి రైతులకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఎమ్మెల్యే వెంట డీసీఎంఎస్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మీరెడ్డి, సీనియర్‌ న్యాయవాది భాస్కర్‌ రెడ్డి, ఎరుకుల చెరువు శివ ఉన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:59 PM

Advertising
Advertising
<