ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nijam Gelavali: రెండో రోజు కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటన

ABN, Publish Date - Jan 10 , 2024 | 08:04 AM

కర్నూలు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి' పేరుతో చేస్తున్న పర్యటన కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు.

కర్నూలు జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి' పేరుతో చేస్తున్న పర్యటన కర్నూలు జిల్లాలో రెండో రోజు బుధవారం కొనసాగనుంది. ఇవాళ ఎమ్మిగనూరులో ఆమె పర్యటిస్తారు. చంద్రబాబు అరెస్టు సమయంలో ఆందోళనకు గురై.. మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శి.. అండగా ఉంటామని ధైర్యం చెబుతూ ఆర్థిక సాయం అందిస్తున్నారు.

కాగా నిన్న (మంగళవారం) కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. ‘అప్తులు దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో మాకు తెలుసు. ఇకపై మీరూ మా కుటుంబ సభ్యులే. అధైర్యపడవద్దు.. మీకు అండగా టీడీపీ ఉందని చెప్పేందుకే చంద్రబాబు నాయుడు నన్ను పంపించారు. ధైర్యంగా ఉండండి..’ అంటూ బాధిత కుటుంబాలను ఓదార్చారు. చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తీవ్రమనోవేదనకు లోనై మృతి చెందిన టీడీపీ కుటుంబాలను ఆమె పరామర్శించారు. పెద్దకడుబూరులో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక టీడీపీ కార్యకర్త హెచ్‌.గోపాల్‌ మృతి చెందారు. ఆయన ఇంటికి వెళ్లిన భువనేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గోపాల్‌ భార్య జయశీలమ్మను ఓదార్చారు. ఈ సందర్భంగా జయశీలమ్మ ‘మాట్లాడుతూ మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం.. మా ఆయన టీడీపీ కోసం ఓసైనికుడిగా చివరిదాకా పనిచేశాడు. మీరు ఇచ్చిన భరోసా ఎంతో ధైర్యాన్నిచ్చింది. మా పిల్లల్ని బాగా చదివించుకుంటా’మన్నారు. అనంతరం గోపాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రూ.3 లక్షల చెక్కును అందజేశారు.

కౌతాళం మండలం వల్లూరు గ్రామానికి చేరుకున్న భువనేశ్వరి వడ్డే ఈరమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరమ్మ భర్త వడ్డె ఈరయ్య, కుమారులు పెద్దనాగేష్‌, చిన్న నాగేష్‌లకు ధైర్యం చెప్పారు. కన్నీటి పర్యంతమైన ఈరయ్యను ఓదార్చి చెక్కును అందజేశారు. మంత్రాలయం పట్టణంలోని రామచంద్రనగర్‌లో చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ కార్యకర్త రాగమ్మ కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించారు. భర్త ఆంజనేయులు, కుటుంబ సభ్యులు లక్ష్మి, మనుమలు భీమేష్‌, మల్లేష్‌లను పరామర్శించారు. చంద్రబాబు అండగా ఉంటారని ఆమె ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ.. ‘సాధారణ కార్యకర్త కుటుంబాలను పరామర్శిస్తారని అనుకోలేదమ్మా. మీరు మాపై చూపిన అభిమానానికి వందనాలు...’ అంటూ భువనేశ్వరితో అన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 09:06 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising