విద్యారంగాన్ని దెబ్బతీయడానికే నూతన విద్యావిధానం
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:29 AM
ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే కేంద్రం జాతీయ నూతన విధ్యావిధానాన్ని బలవంతంగా అమలు చేస్తుందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యాక్షుడు గుజ్జల ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు ఆరోపించారు.
ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యక్షుడు ఈశ్వరయ్య
ఆదోనిలో ప్రారంభమైన ఏఐఎస్‌ఎఫ్ జిల్లా 30వ మహాసభలు
ఆదోని అగ్రికల్చర్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకే కేంద్రం జాతీయ నూతన విధ్యావిధానాన్ని బలవంతంగా అమలు చేస్తుందని ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మాజీ ఉపాధ్యాక్షుడు గుజ్జల ఈశ్వరయ్య, రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు ఆరోపించారు. మంగళవారం ఆదోనిలో ఏఐఎస్‌ఎఫ్ 30వ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ నుంచి వైఎంజీ సర్కిల్ బీమాస్ కూడలి మీదుగా రెడ్డీస్ హాస్టల్ వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహిం చారు. విద్య కాషాయీకరణకు కుట్ర పన్నారని, శాస్త్రీయమైన విద్యను అమలు చేయకుండా ఆశాస్త్రీయమైన విధానాలతో విద్యావ్యవస్థ కుంటుపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానం ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు లాభం చేకూర్చే విధంగా ఉందన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు కేవలం 9శాతం నిధులు కేటాయించడం అన్యాయమన్నారు. ఈ నిధులు పాఠశాలల మరమ్మతులు, ఉపాధ్యాయ ఖాళీల భర్తీ, పుస్తకాలకు సరిపోవన్నారు. ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారన్నారు. కలిసిక ట్టుగా పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. సీసీఐ కార్యదర్శి వర్గ సభ్యుడు రామచంద్రయ్య, ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి లెనిన్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తల్లికి వందనం ఉచిత బస్సుతోపాటు ఏ ఒక్క హామీని అమలు చేయకుండా అన్యాయం చేస్తుందన్నారు. పీఎం మోదీ బేఠీ బచావో.. బేఠీ పడావో అంటున్నారే తప్ప ఎక్కడ కూడా బాలికలకు రక్షణ లేదన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాజీ జిల్లా కార్యదర్శి శ్రీరాము డు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుళాయి స్వామి, కార్యదర్శి షాబిర్ బాషా, సీసీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, ఎస్టీయూ సోషల్ మీడియా కన్వీనర్ వీరచంద్ర యాదవ్, సీపీఐ జిల్లా కార్యదర్శి సభ్యుడు అజయ్‌బాబు, లక్ష్మి రెడ్డి, కల్లుబావి రాజు, శరత్ కుమార్, రంగాస్వామి, ఆల్ఫావిజ యేంద్ర, థామస్, శ్రీకాంత్, శ్రీరంగ, సుదర్శన్ పాల్గొన్నారు.
Updated Date - Nov 13 , 2024 | 12:29 AM