ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సూచికల లక్ష్యాలను సాధించాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:42 AM

హొళగుంద, మద్దికెర, చిప్పగిరి మండలాల్లో నిర్దేశించిన 40 సూచికలకు సంబంధించిన లక్ష్యాలను డిసెంబరులోపు సాధించాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ రంజితబాషా

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): హొళగుంద, మద్దికెర, చిప్పగిరి మండలాల్లో నిర్దేశించిన 40 సూచికలకు సంబంధించిన లక్ష్యాలను డిసెంబరులోపు సాధించాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స హాలులో యాస్పిరేషనల్‌ బ్లాక్స్‌ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఐసీడీఎస్‌కు సంబంధించి తీవ్రమైన పోషకాహార లోపం, మితమైన పోషకాహార లోపం ఉన్న ఐదేళ్లలోపు పిల్లలకు ఏఎనఎం, అంగనవాడీ టీచర్లు , ఆయాలు పిల్లల ఇంటికి వెళ్లి ఎలాంటి న్యూట్రీషన ఆహారం ఇచ్చారు.. బాలామృతం ఇచ్చారు.. తదితర వివరాలను యాప్‌లో అప్‌లోడు చేయాలని ఆదేశించారు. అంగనవాడీ కేంద్రాల్లో పెండింగ్‌లో ఉన్న టాయిలెట్లు, ట్యాప్‌ కనెక్షనలను డిసెంబరులోపు పూర్తి చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌కు సంబంధించి జల్‌జీవన మిషన కింద పెండింగ్‌లో ఉన్న ఇంటింటికి కొళాయి కనెక్షన్లను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. అలాగే ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలుగా తీర్చిది ద్దాలన్నారు. ఫైబర్‌ నెట్‌కు సంబంధించి ఈ మూడు మండలాల్లో వంద శాతం ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకో వాలన్నారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, సీపీవో హిమ ప్రభాకర్‌ రాజు, ఐసీడీఎస్‌ పీడీ వెంకటలక్ష్మి, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, యాస్పిరేషనల్‌ బ్లాక్స్‌ మండలాల అధికారులు పాల్గొన్నారు.

పంటలకు బీమా చేయాలి: రబీలో జొన్న, వేరుశనగ, టమోటా, శనగ, ఉల్లి పంటలకు బీమా ఆఖరు తేదీ డిసెంబరు 15 అని, వరి పంటకు ఆఖరు తేదీ డిసెంబరు 31 అని ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకో వాలని కలెక్టర్‌ పి.రంజిత బాషా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స హాల్లో జిల్లాలో పంటల బీమాకు సంబంధించి స్వచ్ఛంద నమోదు కార్యాచరణ ప్రణాళిక అమలుపై కలెక్టర్‌ జిల్లా స్థాయి మాని టరింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతులు ప్రతి ఎకరాకు ప్రీమియం రూపంలో శనగ రూ.420, జొన్న రూ.297, వేరుశనగ రూ.480, ఉల్లిగడ్డ రూ.1350, టమోటా రూ.1500 ప్రీమియం చెల్లించి పంటలకు బీమా చేసుకోవడానికి ఆఖరి తేదీ డిసెంబరు 15 అని తెలిపారు. వరి పంటకు రైతులు ప్రతి ఎకరాకు రూ.630 ప్రీమియంగా చెల్లించి డిసెంబరు 31లోపు బీమా చేయించు కోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, డీఆర్వో సి.వెంకటనారాయణమ్మ, జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 12:42 AM