ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిశ్చితార్థాలను అడ్డుకున్న అధికారులు

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:27 AM

జిల్లాలో ఒకేసారి ఇద్దరు బాలికల నిశ్చితార్థాలను ఐసీడీఎస్‌, ఐసీపీ ఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటలక్ష్మి ఆదేశాల మేరకు మూడు ప్రాంతాల్లో అడ్డుకున్నారు.

తల్లిదండ్రులకు అవగాహన పత్రం ఇస్తున్న డీసీపీవో శారద

కర్నూలు హాస్పిటల్‌, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒకేసారి ఇద్దరు బాలికల నిశ్చితార్థాలను ఐసీడీఎస్‌, ఐసీపీ ఎస్‌ అధికారులు అడ్డుకున్నారు. ఐసీడీఎస్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెంకటలక్ష్మి ఆదేశాల మేరకు మూడు ప్రాంతాల్లో అడ్డుకున్నారు. సి.బెళగల్‌ మండలం కంబదహాల్‌ గ్రామం లో 15 సంవత్సరాల బాలిక, కర్నూలు మం డలం గొందిపర్లలో 17 సంవత్సరాల అమ్మా యిలకు చేస్తున్న నిశ్చితార్థం కార్యక్రమాన్ని అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. డీసీపీవో టి.శారద మాట్లాడుతూ బాల్య వివాహాలు చేయడం వల్ల శారీరక మానసిక సమస్యలతోపాటు పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా జన్మించరని తెలిపారు. కౌన్సెలింగ్‌ ఇవ్వగా తల్లిదండ్రులు సమ్మతించి నిశ్చితార్థాన్ని విరమించారు. తల్లిదండ్రులు అంగీకార పత్రాన్ని అధికా రులకు రాసి ఇచ్చారు. డీసీపీవో టి.శారద, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పద్మ, మల్లేశ్వరి, డీసీపీయూ సిబ్బంది నరసింహులు, నాగేశ్వరరావు, శ్వేత, కీర్తి, మహిళా పోలీసు సృజన నాయుడు, ఆర్గనైజేషన్‌ మధు, రాఘవేంద్ర పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:27 AM