ఉత్సవాలకు మూడు రోజులే అనుమతి: ఆర్డీవో
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:32 AM
పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు మూడురోజులకే అనుమతి ఉందని ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు.
పత్తికొండ, సెప్టెంబరు 4: పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు మూడురోజులకే అనుమతి ఉందని ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. బుధవారం డీఎస్పీ వెంకట్రామయ్యతో కలిసి పత్తికొండ వినాయక ఉత్సవకమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఉత్సవా లకు ఐదురోజులకు ఇవ్వాలని కోరగా, ఉన్నతాధికారులు మూడురోజులకే ఇచ్చారని తెలిపారు. ప్రతి మండపానికి వాట్సప్‌లో అనుమతి తీసుకోవాలని,ీ ససీ కెమెరాలను ఏర్పాటుచేయాలన్నారు. 9వ తేది నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్‌సమస్య తలెత్తకుండా నిర్వాహకులు తమకు కేటాయించిన సమయంలోనే వ్రిగహాలను తరలించాలని కోరారు. రూరల్ సీఐ పులిశేఖర్, బీజేపీ ఉపాఽధ్యక్షుడు గోవర్డన్‌నాయుడు, కాంగ్రెస్ ఇన్‌చార్జి. క్రాంతినాయుడు, సభ్యులు ఉన్నారు.
అల్లర్లకు పాల్పడవద్దు : డీఎస్పీ
మంత్రాలయం: వినాయక చవితి వేడుకల్లో అల్లర్లకు పాల్పడవద్దని ఎమ్మిగనూరు ఇన్‌చార్జి డీఎస్పీ శ్రీనివాసచార్ సూచించారు. బుధవారం సాయంత్రం మంత్రాలయం సర్కిల్ కార్యాలయంలో వినాయక చవితి ఉత్సవాల ఏర్పాటుపై సీఐ రామయ్య ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐ పరమేష్ నాయక్, కృష్ణయ్య, రాఘవేంద్ర, దశరథరాముడు, గోవిందు, బసప్ప తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:32 AM