నీటి సంఘాల ఎన్నికలకు సిద్ధం
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:54 PM
సాగునీటి సంఘాల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టరు పి. రంజిత్‌బాషా డిసెంబరు 5న నోటిఫికేషన్ జారీ చేస్తారు.
8న ఉమ్మడి జిల్లాలో 384 సాగు నీటి సంఘాలకు..
11న డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 14న ప్రాజెక్టు కమిటీల ఎన్నిక
ఎన్నికల విధుల్లో ఐదు వేల మందికి పైగా సిబ్బంది
సాగునీటి సంఘాల ఎన్నికలకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. కలెక్టరు పి. రంజిత్‌బాషా డిసెంబరు 5న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 8 నుంచి 14వ తేదీలోగా కసరత్తు పూర్తి చేసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. తొమ్మిదేళ్ల తరువాత నీటి సంఘాల ఎన్నికలకు అక్టోబరు 21న కలెక్టరు నోటిఫికేషన్ జారీ చేశారు. షెడ్యూలు ప్రకారం 23న ఎన్నికలు జరగాల్సి ఉంది. అసెంబ్లీ సమావేశాల కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు రెండు జిల్లాల యంత్రాంగం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. దాదాపుగా ఐదు వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. కర్నూలు కలెక్టర్ పి. రంజిత్‌బాషా, నంద్యాల కలెక్టర్ రాజకుమారి పర్యవేక్షణలో ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇస్తున్నారు. ఏకగ్రీవం చేసుకోవడానికి అధికార టీడీపీ కూటమి నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. పట్టు కోసం బరిలో దిగాలని వైసీపీ నాయకులు ఎత్తులు వేస్తున్నారు. దీంతో చలికాలంలోనూ పల్లెసీమల్లో నీటి సంఘాల ఎన్నికల వేడి రాజుకుంది.
కర్నూలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ, గాజులదిన్నె ప్రాజెక్టు, టీబీపీ హెచ్చెల్సీ ఆలూరు బ్రాంచి కెనాల్, హంద్రీనీవా కాలువ, కేసీ కాలువ, రాంపురం ఛానల్ కెనాల్, నంంద్యాల జిల్లాలో కేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, శివభాష్యం, మైలవరం ప్రాజెక్టులతో పాటు మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉన్నాయి. ఈ నీటి వనరుల నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో 384 సాగునీటి సంఘాలకు ఎన్నికలు జరగాల్సి ఉండింది. రాష్ట్ర విభజన తర్వాత 2015-16లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం సాగునీటి సంఘాలకు ఎన్నికలు నిర్వహించింది. 2019 మేలో కొలువుదీరిన వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికలు నిర్వహించలేదు. నీటి సంఘాలు, డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీలకు అధ్యక్ష, ఉపాఽధ్యక్షులు, డైరెక్టర్లగా వైసీపీ నాయకులు, సానుభూతిపరులను నామినేట్ చేసింది. మళ్లీ టీడీపీ కూటమి ప్రభుత్వం రాకతో గ్రామ సీమల్లో సాగునీటి సంఘాల్లో రైతులను భాగస్వామ్యం చేసి.. కాలువలు, డిస్ట్రిబ్యూటరీలను ఆఽధునికీకరించాలనే సంకల్పంతో ఎన్నికల నిర్వహణకు సై అంది. మూడు దశల్లో ఎన్నికలు ప్రక్రియ పూర్తి చేసేందుకు జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో కసరత్తు చేస్తున్నారు. అదే క్రమంలో ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు.
పల్లెల్లో ఎన్నికల వేడి
కర్నూలు జిల్లాలో 123 సాగునీటి సంఘాలు, 10 డిస్ర్టిబ్యూటరీ కమిటీలు, 2 ప్రాజెక్టు కమిటీ ఎన్నికలకు జిల్లా కలెక్టర్ పి. రంజిత్‌బాషా, నంద్యాల జిల్లాలో 261 సాగునీటి సంఘాలు, 25 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 4 ప్రాజెక్టు కమిటీల ఎన్నికలకు ఆ జిల్లా కలెక్టర్ రాజకుమారి డిసెంబరు 5న నోటిషికేషన్ జారీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో 123 నీటి సంఘాలకు 1,212 టీసీ (ప్రాదేశిక నియోజకవర్గం) సభ్యులు, నంద్యాల జిల్లాలో 261 సాగునీటి సంఘాలకు 2,349 టీసీ సభ్యులను రైతులు ఎన్నుకుంటారు. టీసీ సభ్యులు డబ్ల్యూయూఏ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు. ఉమ్మడి జిల్లాలో 35 డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 6 ప్రాజెక్టు కమిటీల అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎంపిక జరగాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఆయా సాగునీటి వనరుల కింద కర్నూలు జిల్లాలో 2,20,499.43 ఎకరాలు, నంద్యాల జిల్లాలో 45,98,190.68 ఎకరాల ఆయకట్టు ఉంది. 2015-16లో భూయాజ్యమాన్యం హక్కు కలిగిన ఆయకట్టు రైతులను ఓటర్లుగా గుర్తించి ఎన్నికలు నిర్వహించారు. తొమ్మిదేళ్లు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ మధ్యకాలం భూముల క్రయవిక్రయాలు, అన్నదమ్ములు విభాగాలు జరిగడంతో రెవిన్యూ రికార్డుల్లో భూయాజమాన్యం హక్కు కలిగిన రైతులు మారిపోయారు. ఇంజనీర్లు, రెవిన్యూ అధికారులు (తహసీల్దారులు) సమన్వయంతో ఆయకట్టు రైతులను గుర్తించి ఓటర్ల జాబితా తయారి కోసం ప్రత్యేక అధీకృత రెవిన్యూ అధికారులను నియమించారు. వీరు తయారు చేసే ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు.
చలి కాలంలో రాజకీయ వేడి
అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు తరువాత జరుగుతున్న ఎన్నికలు ఇవి. అధికార, ప్రతిపక్ష పార్టీలకు గ్రామాల్లో రాజకీయ పట్టు కోసం నీటి సంఘాలు కీలకంగా మారనున్నాయి. నీటి సంఘాలను ఏకగ్రీవం చేసుకోవడానికి అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు వ్యూహాత్మంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ముఖ్య రాజకీయ నాయకులు రంగంలోకి దిగారు. నీటి సంఘాలు, డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, ప్రాజెక్టు కమిటీల అధ్యక్ష, ఉపాఽధ్యక్ష అభ్యర్థుల వేటలో నిమగ్నమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో నిస్తేజంలో ఉన్న వైసీపీ నాయకులు కూడా నీటి సంఘాల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పట్టు సాధిస్తే రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉపయోగకరంగా ఉంటుందని ఇరుపార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పల్లెసీమల్లో రాజకీయ వేడి రాజుకుంది.
నీటి సంఘాల ఎన్నికల షెడ్యూల్
నోటిఫికేషన్ (టీసీ, డబ్ల్యూయూఏ, డీసీ, పీసీ కమిటీ): డిసెంబరు 5
నీటి సంఘాల టీసీ సభ్యులు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక : 8న
డిస్ట్రిబ్యూటరీ కమిటీ (మేజర్, మీడియం ప్రాజెక్ట్స్) : 11న
మేజర్, మీడియం ప్రాజెక్ట్ కమిటీ ఎన్నిక : 14న
కర్నూలు జిల్లాలో సాగునీటి సంఘాలు,
డీసీ, పీసీ, ఆయకట్టు (ఎకరాలు) వివరాలు
ప్రాజెక్టు డబ్ల్యూ డీసీ పీసీ ఆయకట్టు
యూఏ
కేసీ కెనాల్ 2 -- -- 4,760
తుంగభద్ర 58 10 1 1,51,134
ప్రాజెక్టు ఎల్లెల్సీ
ఆలూరు 6 -- -- 14,254.67
బ్రాంచి కెనాల్
హంద్రీ నీవా కాలువ 3 -- -- 5,072.82
గాజులదిన్నె ప్రాజెక్టు 12 -- 1 25,488.34
మైనర్ ఇరిగేషన్ 42 -- -- 19,789.60
చెరువులు
మొత్తం 123 10 2 2,20,499.43
నంద్యాల జిల్లాలో సాగు నీటి సంఘాలు,
డీసీ, పీసీ, ఆయకట్టు (ఎకరాలు) వివరాలు:
ప్రాజెక్టు డబ్ల్యూ డీసీ పీసీ ఆయకట్టు
యూఏ
కేసీ కాలువ 52 9 1 1,62,854.46
శ్రీశైలం కుడి 50 8 1 1,53,034.8
కాలువ (ఎస్సార్బీసీ)
తెలుగుగంగ ప్రాజెక్టు 47 8 1 1,29,412.42
శివభాష్యం ప్రాజెక్టు 7 -- 1 12,092
మైనర్ ఇరిగేషన్ 104 -- -- 40,056.79
చెరువులు
మైలవరం ప్రాజెక్టు 1 -- -- 740.21
మొత్తం 261 25 4 4,98,190.68
Updated Date - Nov 29 , 2024 | 11:54 PM