ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:07 AM

శాంతినగర్‌ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని సోమవారం నగర పాలక కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణకు వినతి పత్రం అందజేశారు.

అడిషనల్‌ కమిషనర్‌కు వినతిపత్రం ఇస్తున్న కాలనీవాసులు

అడిషనల్‌ కమిషనర్‌కు కాలనీ వాసుల వినతి

కర్నూలు న్యూసిటీ, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): శాంతినగర్‌ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని సోమవారం నగర పాలక కార్యాలయంలో అడిషనల్‌ కమిషనర్‌ ఆర్‌జీవీ కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన ప్రతి నిధులు పి.మల్లికార్జున మాట్లాడుతూ కాలనీల్లో పగలు పాములు, రాత్రి దోమలు సంచరిస్తున్నాయన్నారు. వర్షం పడితే రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయన్నారు. రూ.కోటితో నిర్మించిన మరుగు కాలువ నిరుప యోగంగా ఉందన్నారు. ఇళ్ల ముందు డ్రైనేజీలు నిర్మించి కాలువలో కలపాలని డిమాండ్‌ చేశారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఇరిగినేని పుల్లారెడ్డి, కాలనీవాసులు స్వామినాయక్‌, లక్ష్మమ్మ, ఖాజాబీ, రమాదేవి పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 01:07 AM