ప్రజా సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్
ABN, Publish Date - Dec 02 , 2024 | 11:26 PM
ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
నంద్యాల కల్చరల్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పీజీఆర్‌ఎస్ సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది జిల్లా, మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని అన్నారు. సరైన రీతిలో ఎండార్స్‌మెంట్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చి గ్రీవెన్స్ కూడా పెండింగ్‌లో ఉన్నాయన్నాయని, పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. వీఆర్‌ఓలు అవినీతికి పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్నాయని, అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేయాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా 14వేల భూ సమస్యలు స్వీకరించారని సంబంధిత ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ నెల 6వ తేదీలోపల అప్‌లోడ్ చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో పీజీఆర్‌ఎస్ కింద 730 సమస్యలు, బియాండ్ ఎస్‌ఎల్‌ఏ లో 44, రీఓపన్‌లో 21 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వీటన్నింటిని నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో 101 మంది తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్‌కు అర్జీలు సమర్పించారు.
‘దీర్ఘకాలిక భూ సమస్యలకు పరిష్కారం’
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించామని కలెక్టర్ రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో భూ సమస్యలను పరిష్కరించి సంబంధిత భూ ఉత్తర్వులు బాధితులకు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారానికి తహసీల్దార్లు, ఆర్డీఓల కార్యాలయాల్లో చుట్టూ తిరిగి విసిగి వేశారిపోయామని బాధిత రైతులు విన్నవించడంతో ఇందుకు సంబంధించిన రికార్డులను తెప్పించుకొని పరిష్కరించామన్నారు.
Updated Date - Dec 02 , 2024 | 11:26 PM