రేషన్ బియ్యం సీజ్
ABN, Publish Date - Nov 16 , 2024 | 01:20 AM
ఆదోని నుంచి రాయచూరుకు పెద్ద లారీలో తరలిస్తున్న దాదాపు 13 టన్నుల అక్రమ బియ్యాన్ని శుక్రవా రం ఉదయం మాధవరం చెక్‌పోస్టు వద్ద పోలీసు అధికారులు పట్టుకున్నా రు. ఈ బియ్యం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రధాన అనుచరుడు, బీజేపీ యువ నాయకుడివని సమాచారం
ఎమ్మెల్యే అనుచరుడని గుర్తింపు?
కర్ణాటకకు తరలిస్తూ, మాధవరం వద్ద పట్టుబడిన వాహనం
ఆదోని గోడౌన్‌లోని బియ్యం నిలువలు సీజ్
ఆదోని రూరల్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని నుంచి రాయచూరుకు పెద్ద లారీలో తరలిస్తున్న దాదాపు 13 టన్నుల అక్రమ బియ్యాన్ని శుక్రవా రం ఉదయం మాధవరం చెక్‌పోస్టు వద్ద పోలీసు అధికారులు పట్టుకున్నా రు. ఈ బియ్యం ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రధాన అనుచరుడు, బీజేపీ యువ నాయకుడివని సమాచారం. ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడి బియ్యం దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతున్నదనే ఆరోపణలన్నాయి. నివారించాల్సిన ఎమ్మెల్యే మౌనం దాల్చడంతో పాటు, ఓ పోలీస్ స్టేషన్ సీఐ అండదండలు పుష్కలంగా ఉండటంతో, ఈ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయిందనే విమర్శలు ఉన్నాయి. గురువారం అర్థరాత్రి ఆస్పరి ప్రధాన రహదారిలో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు సమాచారం వచ్చింది. ఆయన రెవెన్యూ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. అయితే ఈ విషయాన్ని కొందరు రెవెన్యూ అధికారులు బియ్యం అక్రమార్కుడికి ముందుగానే సమాచారం ఇవ్వడంతో, అధికారులు బియ్యం అక్రమ నిలువల స్థావరానికి వెళ్లే లోపే, అక్కడి నుంచి బియ్యం లారీలతో పాటు నిందితులు జారుకున్నారు. ఆ తర్వాత శుక్రవారం రాయచూర్ తరలిస్తున్నరని తెలియడంతో అధికారులు అప్రమత్తమై స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత తెలిసిన సమాచారం మేరకు భాస్కర్ రెడ్డి కాలనీలో ఓ ఇంట్లో సదరు బీజేపీ యువ నాయకుడికి సంబంధించిన బియ్యం నిలువలు ఉంచారని శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో సబ్ కలెక్టర్‌కు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు తహసీల్దార్ శివరాముడు, సీఎస్‌డీటీ వలిబాషా, రెవె న్యూ ఇన్‌స్పెక్టర్ ఖాసీం, వీఆర్వోలు రాజశేఖర్ గౌడ్, అంజనేయులు దాడులు నిర్వహించి, దాదాపు 40 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సీఎస్‌డీటీ వలిబాషా తెలిపారు
బియ్యం లారీ పట్టివేత
మంత్రాలయం, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): కర్ణాటకకు తరలిపోతున్న బియ్యం లారీని మండలంలోని మాధవరం చెక్‌పోస్ట్ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. రాయచూరుకు చెందిన భరత్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని ఆదోని నుంచి రాయచూరుకు తరలిస్తుండగా చెక్‌పోస్ట్ ఎక్సైజ్ సీఐ చంద్రశేఖర్‌నాయుడు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. లారీ బియ్యంతో సహా డ్రైవర్ శ్రీకాంత్‌ను మాధవరం పోలీసులకు అప్పగించారు. మాధవరం ఎస్‌ఐ విజయ్‌కుమార్ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇవ్వడంతో 200 బస్తాల్లోని 80 క్వింటాళ్ల బియ్యాన్ని గుర్తించి కేసు నమోదు చేశారు. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఆదాం, వీఆర్‌వో నర్సప్ప, వీఆర్‌ఏ పంపాపతిలతో పంచనామా నిర్వహించి రెవెన్యూ అధికారులకు బియ్యాన్ని అప్పగించారు. వాటిని ఎమ్మిగనూరు గోడంకు తరలించారు. అక్రమంగా తరలిస్తున్న బియ్యం వెనుక ఎవరున్నారనేది త్వరలో తేలుస్తామని ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపారు. ఈ దాడుల్లో పోలీస్ సిబ్బంది వీరేష్, వీరాంజనేయులు, రామకృష్ణ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 16 , 2024 | 01:20 AM