ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కందిపోతోంది

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:15 AM

కాపు దశలో ఉన్న కంది పంటను గూడు, పచ్చ పురుగు ఆశించాయి. ఈ పురుగులు పంటను నమిలేస్తుండటంతో పూత, కాయలు రాలిపోతున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ అధికారులు సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు.

తుగ్గలిలో సాగు చేసిన కంది పంట

కంది పంటకు ఓ వైపు పురుగు, మరోవైపు పొగమంచు దెబ్బ

పూత, కాయ రాలి దెబ్బతిన్న పంట

తుగ్గలి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): మండలంలో ఈ ఏడాది 24,815 ఎకరాల్లో కంది సాగు చేశారు. పంట ఏపుగా పెరిగి కాపు పట్టడంతో అధిక దిగుబడి వస్తుందని రైతులు సంబరపడ్డారు. అయితే గూడు, పచ్చ పురుగులు ఆశించడంతో ఆశలు ఆవిరయ్యాయి.

పెట్టుబడి కూడా రాదు..

కంది సాగుకు ఎకరాకు రూ.12 వేలకు పైగా ఖర్చు అవుతుంది. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చు తదితర ఖర్చులు వస్తాయి. ఎకరాకు 6 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తేనే గిట్టుబాటు అవుతుం ది. అయితే పంట పూత, కాయ రాలిపోతే పెట్టుబడి వచ్చేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పురుగు మందులు వాడినా తగ్గని పురుగు

పంటను కాపాడుకునేందుకు పురుగు మందులను పిచికారి చేసినా పురుగు తగ్గలేదు. మరోవైపు పొగమంచుతో పూత రాలిపోతోంది. దీంతో ఎం చేయాలో తోచడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయాధికారులు పంటను పరిశీలించి, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు.

ఆరుసార్లు మందులు పిచికారీ చేశా

ఐదెకరాలతో పాటు మరో 6 ఎకరాలు కౌలుకు తీసుకుని కంది సాగు చేశాను. రూ.1.20 లక్షలు ఖర్చు అయింది. పంట బాగా పెరిగింది. అయితే పొగ మంచు, పురుగు దెబ్బకు పూత, కాయ రాలిపోతోంది. ఆరుసార్లు మందులు కొట్టినా అదుపు కాలేదు. - సుంకన్న, పగిడిరాయి

క్లోరానా్ట్ర నిలిప్రోల్‌ పిచికారీ చేయాలి

కందిలో గూడు పురుగు, పచ్చ పురుగు (మారకామ చ్చల పురుగు) నివారణకు లీటరు నీటికి 0.3మి.లీల క్లోరానా్ట్రనిలిప్రోల్‌ మందును పిచికాఈ చేస్తే పురుగు కంది పంటను ఆశించదు. ఇష్టానుసారంగా పిచికారీ చేస్తే డబ్బులు వృథా అవుతాయి, పురుగు చనిపోదు. - పవన్‌ కుమార్‌, ఏవో, తుగ్గలి

Updated Date - Nov 17 , 2024 | 12:15 AM