‘ఇసుక’ రిజిస్ట్రేషన తప్పనిసరి
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:43 AM
ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టిందని, అయితే ఇసుక కావాల్సిన వారు ముందుగా తమ పేర్లను గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని జిల్లా మైనింగ్ విజిలెన్స అధికారి బాలునాయక్ తెలిపారు.
కౌతాళం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక విధానం ప్రవేశ పెట్టిందని, అయితే ఇసుక కావాల్సిన వారు ముందుగా తమ పేర్లను గ్రామ సచివాలయాల్లో నమోదు చేసుకోవాలని జిల్లా మైనింగ్ విజిలెన్స అధికారి బాలునాయక్ తెలిపారు. కౌతా ళం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. మైనింగ్ అధికారి మాట్లాడుతూ మండలంలోని మరళి గ్రామంలో ఉన్న ఇసుక రీచ నుంచి ఇసుకను ఉచితంగా తీసుకోవచ్చన్నారు. అయితే సచివాలయంలో పేర్లు నమోదు చేసుకొని టన్నుకు రూ.119ల ప్రకారం నగదును చెల్లించి ఇసుకను తీసుకుపోవచ్చని, అక్రమంగా ఇసుకను తరలిస్తే కేసు నమోదు చేయడంతోపాటు వాహనాలను సీజ్ చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ మల్లికార్జున స్వామి, డిప్యూటీ తహసీల్దార్ రజినీకాంత రెడ్డి, కౌతాళం సీఐ అశోక్ కుమార్, మండల వీఆర్వోలు పాల్గొన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 12:43 AM