సమస్యలను పరిష్కరించండి
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:57 AM
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించారు. మండలాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. సోమవారం కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదిక నిర్వహించారు. మండలాల ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మండలాల నుంచి వచ్చిన సమస్యలు కొన్ని
1. ఆదోని పట్టణం వైఎస్సార్ నగర్ 3వ లైనులో తాగునీటి పైపులైన్ లేదని, బోరు పని చేయడం లేదని కాలనీ ప్రజలు అర్జీ సమర్పించారు.
2. తనకు సర్వేనెంబరు 266లో 2.63 ఎకరాల భూమి పెద్దల నుంచి సంక్రమించించదని, పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేయాలని పెద్దకడూరు మండలం హులికన్వి గ్రామానికి చెందిన బి.దత్తాత్రేయ అర్జీ ఇచ్చారు.
3. ఆదోని మండలం గణేకల్ గ్రామానికి చెందిన ఆంజనేయ తనకు సర్వే నెంబర్ 17లో 1.26 ఎకరాల భూమి ఉందని, ఆన్‌లైన్, అడంగల్‌లో నమోదు చేయాలని అర్జీ సమర్పించారు.
4. తనకు సర్వేనెంబర్ 51లో 7.33 ఎకరాల భూమి పెద్దల నుంచి సంక్రమించిందని, ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్ పుస్తకం ఇవ్వాలని ఆదోని మండలం బసర కోడు గ్రామానికి చెందిన అంజనప్ప అర్జీ ఇచ్చారు. సర్వేయర్లు శ్రీనివాసరాజు, వేణు సూర్య, హౌసింగ్ డీఈ రవి కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియ, డిప్యూటీ డీఎంహెచ్వో సత్యవతి, ఆర్‌అండ్‌బీ డిప్యూటీ ఇంజనీర్ వెంకటేశ్వరులు, డిప్యూటీ డీఈవో వెంకట రమణ రెడ్డి పాల్గొన్నారు.
ఆలయ భూములను కాపాడండి
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ రిజినల్ ఇన్‌చార్జ్ మోపిరి సూర్య కోరారు. సోమవారం సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్‌కు వినతిపత్రం అందజేశారు. హిందూ పరిరక్షణ సంస్థల పేరుతో ఆలయ భూములను ఆక్రమించి అమ్ముకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అర్హులకే ఆ భూములు ఇవ్వాలని కోరారు.
ఆలయాల భూములను రక్షించండి
ఆదోని రూరల్: జిల్లాలోని ఆలయ భూములు అన్యాక్రాంత మవుతున్నాయని రక్షించాలని నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ రాయలసీమ రీజినల్ ఇంచార్జి మోపిరి సూర్య కోరారు. సోమవారం సబ్ కలెక్టర్ మౌర్యభరద్వాజ్‌ను కలిసి ఆయన వినతిపత్రం అందజేశారు.
Updated Date - Dec 03 , 2024 | 12:57 AM