ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కృష్ణమ్మ ఒడిలోకి సంగమేశ్వరుడు

ABN, Publish Date - Jul 26 , 2024 | 11:18 PM

ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.

ఎనిమిది నెలల తర్వాతే తిరిగి స్వామి వారి దర్శనం

కొత్తపల్లి, జూలై 26: ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి శుక్రవారం భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. కొత్తపల్లి మండలంలోని శ్రీశైలం వెనుకతట్టు జలాల్లో నిక్షిప్తమైన సప్తనదుల సంగమేశ్వరుడు జలాధివాసమయ్యారు. మూడు అడుగుల మేర వరద వచ్చి చేరితో శుక్రవారం రాత్రిలోపు పూర్తిగా స్వామివారు జలాధివాసం కానున్నారు. నదిలో నీరు తగ్గితే మరో ఎనిమిది నెలల తర్వాతనే భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కలగనుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 2,58,069 క్యూసెక్కుల వరద జలాలు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగుల కాగా, 861 అడగులకు చేరుకుంది. అలాగే జలాశయం నీటి నిల్వ పూర్తి సామర్థ్యం 215 టీఎంసీలు కాగా, 119.0060 టీఎంసీలుగా నమోదైంది. శ్రీశైలం జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో రైతులు, నది పరివాహక ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్న మత్స్యకారులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 26 , 2024 | 11:18 PM

Advertising
Advertising
<