ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Srisailam: రేపటి నుంచి శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

ABN, Publish Date - Jan 11 , 2024 | 07:38 AM

నంద్యాల జిల్లా: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని...

నంద్యాల జిల్లా: శ్రీశైలం మహాక్షేత్రంలో శుక్రవారం నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు నిలుపుదల చేస్తున్నట్లు ఈవో పెద్ది రాజు తెలిపారు. పంచాహ్నిక దీక్షతో 7 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలు ఈనెల 18న ముగుస్తాయని, ఆలయ సాంప్రదాయాన్ని అనుసరించి మల్లికార్జునస్వామికి ఏటా రెండు సార్లు.. సంక్రాంతికి, శివరాత్రికి దేవస్థానం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామని ఈవో తెలిపారు.

శుక్రవారం ఉదయం 8.30 గంటలకు స్వామివారి యాగశాల ప్రవేశంతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నామని, అదేరోజు సాయంత్రం 5 గంటలకు అంకురార్పణ అగ్ని ప్రతిష్టాపన 7 గంటలకు ధ్వజారోహణ సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం అవిష్కరిస్తామని ఈవో తెలిపారు. బ్రహ్మోత్సవాల భాగంగానే శ్రీస్వామి అమ్మవార్లకు ప్రతిరోజు విశేష పూజలు నిర్వహించనున్నట్లు పెద్ది రాజు వెల్లడించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Updated Date - Jan 11 , 2024 | 07:38 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising