గర్భిణులకు స్కానింగ్ తిప్పలు
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:36 AM
ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణులకు ప్రతి సోమవారం నిర్వహించే స్కానింగ్ తిప్పలు తప్పడం లేదు.
ఎమ్మిగనూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలలో గర్భిణులకు ప్రతి సోమవారం నిర్వహించే స్కానింగ్ తిప్పలు తప్పడం లేదు. ఎమ్మిగనూరు చుట్టముట్టు పల్లెల నుంచే గాక మంత్రాలయం, నందవరం, గోనెగండ్ల మండలాల నుంచి సైతం గర్భిణులు నిత్యం ఈ వైద్యశాలకు స్కా నింగ్ కోసం వస్తుంటారు. అయితే గర్భిణులకు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన వైద్యశాల సిబ్బంది మాత్రం అవేమి తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. సోమవారం ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన స్కా నింగ్‌కు ఆయా గ్రామాల నుంచి దాదాపు 593 మంది గర్భిణులు వచ్చారు. అయితే వారికి సరిపడ సౌకర్యా లను అధికారులు ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బం దులకు గురయ్యారు. కేవలం ఒక సేమియానాను మాత్రమే కట్టి కొన్ని కుర్చీలను వేసి చేతులు దులుపు కున్నారు. దీంతో అధిక సంఖ్యలో స్కానింగ్ కోసం వచ్చిన గర్భిణులు ఆస్పత్రిలోని ప్రధాన కార్యాలయం ముందు నేలపైనే కూర్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. కొంతమంది చెట్లకింద కూర్చోవడం కనిపించింది. అంతేగాక గంటలు తరబడి లైనలో నిల్చోలేక గర్భిణులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గర్భిణులు తాగేందుకు కూడా మంచినీరు కూడా కరువయ్యాయి. ఈ విషయం పై ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాను వివరణ కోరగా భారీ స్థాయిలో గర్భిణులు వస్తారని ఊహించలేదన్నారు. మరోసారి స్కానింగ్ సమయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. అధిక సంఖ్యలో గర్భిణులు ఒకే రోజు రావడంతోనే కొంత ఇబ్బందులకు గురయ్యారన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:36 AM