పాఠశాల శుభ్రత మన బాధ్యత
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:14 AM
పాఠశాల శుభ్రత మన బాధ్యతని రాయలసీమ విశ్రాంత ఐజీ ఇక్బాల్ అన్నారు. మంగళవారం జడ్పీహెచ్ పాఠశాలను సందర్శించారు.
గోనెగండ్ల, అక్టోబరు 1: పాఠశాల శుభ్రత మన బాధ్యతని రాయలసీమ విశ్రాంత ఐజీ ఇక్బాల్ అన్నారు. మంగళవారం జడ్పీహెచ్ పాఠశాలను సందర్శించారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసహనం వ్యక్తం చేసి, పంచాయతీ సిబ్బందిని పిలిపించి, తానే వారితో కలిసి శుభ్రం చేశారు. 2018లో ఐజీగా ఇక్కడకు వచ్చానని, మురుగు ఉండటంతో డ్రైనేజీ ఏర్పాటు చేశామన్నారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి సతీష్‌ను సన్మానించారు. శానిటనీ ఇన్‌స్పెక్టర్ మలాంగ్, అనిల్ పాల్గొన్నారు.
Updated Date - Oct 02 , 2024 | 12:14 AM