‘ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’
ABN, Publish Date - Aug 28 , 2024 | 01:05 AM
అంగనవాడీ వర్కర్స్, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలిత డిమాండ్ చేశారు.
కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 27: అంగనవాడీ వర్కర్స్, హెల్పర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జే.లలిత డిమాండ్ చేశారు. సెప్టెంబరు 1, 2, 3 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగే జాతీయ కౌన్సిల్ సమావేశాలు జయప్రదం చేయాలని కోరుతూ కర్నూలు అర్బన ఒకటో సెక్టార్ అంగనవాడీ టీచర్లతో కలిసి కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ అంగనవాడీల కనీస వేతనం రూ.26 వేలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్.ము నెప్ప, నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్, యూనియన జిల్లా కార్యదర్శి చౌడేశ్వరి, పార్వతి, జయశ్రీ పాల్గొన్నారు.
ఫ విజయవాడలో ఈనెల 28న జరిగే భూ భాదితుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ రైతు సంఘం జిల్లా కార్యదర్శి దంబోళం శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈసమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భూ కుంభకోణాలపైన, పేద భూములు ఆక్రమణ లపైన చర్చ ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా భూ బాధితులు సదస్సుకు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
Updated Date - Aug 28 , 2024 | 01:05 AM