తాగునీటి కష్టాలు తీర్చాలి
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:28 AM
ఎమ్మిగనూరు పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి
మ్మిగనూరు ప్రజల కష్టాలపై అసెంబ్లీలో గళం
ఎమ్మిగనూరు, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు పట్టణ ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం అసెంబ్లీలో గళం విప్పారు. ఆయన మాట్లాడుతూ అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఏఐఐబీ తాగునీటి ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో ఆపేసిందననారు. పనులు నత్తనడకన సాగాయని దీంతో పట్టణ ప్రజలు తాగునీటి కష్టాలను ఎదుర్కోంటున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి, పట్టణ ప్రజల తాగునీటి కాష్టాలను తీర్చేలా చూడాలని మున్సిపల్ మంత్రి నారాయణను కోరారు. ఇందుకు స్పందించిన మంత్రి నారాయణ ప్రస్తుతం ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి టీబీడ్యాం ఎల్లెల్సీ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు. అయితే పట్టణానికి 14.07 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉండగా ప్రస్తుతం 10.45 ఎంఎల్‌డీల నీరు మ్రాతమే సరఫరా అవుతోందన్నారు. 2019 ఫిబ్రవరిలో ఏసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్ బ్యాంకు, రాష్ట్ర ప్రభుత్వం 70ః30 శాతం నిధులతో మున్సిపాలిటిల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు విడుదల చేసినా, గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిఽధులు విడుదల చేయకపోవటంతో ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదన్నారు. వైసీపీ హయాంలో కేవలం 8.3శాతం పనులు మాత్రమే చేశారని తెలిపారు. ప్రాజెక్టు గడువు ఈ ఏడాది జూలై నాటికి ముగియటంతో సీఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడి గడువు పొడిగించేలా చర్యలు తీసుకున్నారన్నారు. తాగునీటి సమస్యను సమూలంగా పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2039వరకు పట్టణ జనాభాను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి తెలిపారు.
Updated Date - Nov 19 , 2024 | 01:28 AM