సమస్యలను పరిష్కరించండి: ఎమ్మెల్యే కేఈ
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:50 AM
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అధికారులను ఆదేశించారు.
మద్దికెర అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎమ్మెల్యే శ్యాంబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాబివృద్ధికి ఎనలేని సేవలందిస్తున్నారని తెలిపారు. వినతుల్లో కొన్ని.. తమ గ్రామంలో తాగునీరు అందడంలేదని, డ్రైనేజీ సరిగా లేదని మదనంతపురానికి చెందిన టీడీపీ నాయకులు శ్రీనివాసులు సంజప్ప, దేవేంద్ర మనవి చేశారు. కాగా కార్యాలయంలో తాగునీరు లేకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు.
బీమా సొమ్ముకోసం ప్రదక్షిణలు
మదనంతపురం గ్రామానికి చెందిన అంకిత తండ్రి పశువుల రామచంద్ర నాలుగేళ్ల క్రితం మరణించాడు. తల్లి, అన్న వలసవెళ్లారు. బీమా పరిహారం అందకపోవడంతో సోమవారం ఎమ్మెల్యేకు వినతిపత్రం ఇవ్వగా స్పందించిన ఆయన న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీనివాసులు, సంజప్ప పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 01:50 AM