స్టాంపు పేపర్ల దందా..!
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:13 AM
పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు యఽథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అధికంగా వసూలు చేస్తున్న వెండర్లు
కళ్లు మూసుకున్న అధికారులు
ఆదోని, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వినియోగదారుల నుంచి అక్రమ వసూళ్లు యఽథేచ్ఛగా సాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భూమి క్రయ విక్రయాలకు స్టాంపు పేపర్లు కొనాలంటే అధిక మొత్తంలో చెల్లించాల్సి వస్తోందని క్రయ విక్రయాలు చేసేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్యాలయంలో కౌంటర్ లేదు..
స్టాంపు పేపర్లను సబ్ రిజిస్ట్రార్ కార్యాలంలో అందుబాటులో ఉంచాలి. అయితే కార్యాలయంలో కౌంటర్ లేదు. బయట స్టాంపు వెండర్ల నుంచి కొనుగోలు చేయాల్సిందే. సిబ్బంది మొత్తం స్టాంపు పేపర్లను స్టాంపు వెండర్లకే ఇచ్చేస్తున్నట్లు సమాచారం.
స్టాంపు వెండర్ల వసూళ్ల దందా..
స్టాంపు వెండర్లు అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ప్రశ్నించిన వారికి స్టాంపు పేపర్లను విక్రయించడం లేదు. రూ.20స్టాంపు పేపరుకు రూ.50లు, రూ.100 పేపర్‌ను రూ.150కు విక్రయిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే స్టాంపు పేపర్ల కొరత ఉందని సమాధానం చెబుతున్నారు.
పట్టించుకోని ఉన్నతాధికారులు..
కొందరు సబ్ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన సోమవారం పరిశీలించారు. ఈ అక్రమ వసూళ్ల దందాపై పలువురు వినియోగదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులకు కూడా ఇందులో భాగముందని ఆరోపణలు ఉన్నాయి.
అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం
స్టాంపు వెండర్లు అధిక ధరకు విక్రయిస్తే లైసెన్స్ రద్దు చేస్తాం. రిజిస్ర్టేషన్ కార్యాలయంలో స్టాంప్ పేపర్ల కొరత ఉంది. జిల్లా అధికారుల సూచనల మేరకు స్టాంపు పేపర్లను అన్నీ వెండర్లకే ఇచ్చేశాం. ఓ బాధితుడు రూ.100 స్టాంప్ పేపర్‌ను రూ.150లకు విక్రయించినట్లు ఫిర్యాదు చేశాడు. లిఖితపూర్వకంగా రాసి ఇవ్వలేదు. అయినా విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. - హజేమియ్య సబ్ రిజిస్ట్రార్, ఆదోని
Updated Date - Nov 12 , 2024 | 12:13 AM