ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వారోత్సవాలను విజయవంతం చేద్దాం

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:04 AM

జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిం చాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పౌర గ్రంథాలయ శాఖ సిబ్బందిని ఆదేశించారు.

గ్రంథాలయ వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ రంజిత్‌ బాషా

కర్నూలు కలెక్టరేట్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతంగా నిర్వహిం చాలని కలెక్టర్‌ పి. రంజిత్‌ బాషా పౌర గ్రంథాలయ శాఖ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్‌ చాంబ ర్‌లో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్స వాల కరపత్రాలను జిల్లా కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలను నిర్వహించుకుంటున్నామని అన్నారు. బాలల దినోత్సవం రోజు నవంబరు 14న జాతీయ పతాక ఆవిష్కరణ, ర్యాలీ, 15న వ్యాసరచన పోటీలు, పుస్తక ప్రదర్శన, పురాతన నాణ్యాల ప్రదర్శన, 16న చిత్రలేఖన పోటీలు, 17న కవి సమ్మేళనం, 18న ప్లాస్టిక్‌ ప్రయోజనాలు, నష్టాల గురించి వక్తృత్వ పోటీలు, 19న మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల సంరక్షణ, నృత్య ప్రదర్శన, 20న డిజిటల్‌ గ్రంథాలయాలపై విద్యార్థులకు అవగాహన, సామూహిక స్వీయ పఠనంతో వారోత్సవాలను ముగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర గ్రంథాలయ సంస్థ సెక్రటరీ ప్రకాష్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌ పెద్దక్క, సీనియర్‌ అసిస్టెంట్‌ మక్బూల్‌ బాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:04 AM