ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డయేరియా ప్రబలకుండా చర్యలు చేపట్టండి: కలెక్టర్‌

ABN, Publish Date - Jun 23 , 2024 | 12:39 AM

డయేరియా వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ జి.సృజన వైద్యాధికారులను ఆదేశించారు.

కర్నూలు(కలెక్టరేట్‌), జూన్‌ 22: డయేరియా వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ జి.సృజన వైద్యాధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో డయేరియా నివారణలో భాగంగా జిల్లా స్థాయి స్టీరింగ్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో తాగునీరు వేడి చేసుకుని చల్లారిన తర్వాత తాగాలని అన్నారు. భోజనం చేసే ముందు చేతుల పరిశుభ్రంగా కడుక్కోవాలని విద్యార్థులకు, చిన్నారులకు, అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చే తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. క్లోరినేషన్‌ డ్రైవ్‌ను ఈ వారంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్లూఓ్యఎస్‌ ఎస్‌ఈని ఆదేశించారు. జాతరలు, ఉత్సవాలు, పెళ్లిళలో కూడా శుభ్రమైన తాగునీరు, తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని డీపీవోను ఆదేశించారు. సమావేశంలో డీఎంహెచ్‌వో ప్రవీణ్‌ కుమార్‌, నగర పాలక సంస్థ అద నపు కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌, డీపీవో నాగరాజునాయుడు, అదనపు డీఎంహెచ్‌వో భాస్కర్‌, డీఈవో శామ్యూల్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2024 | 12:39 AM

Advertising
Advertising