మత సామరస్యానికి ప్రతీక టీడీపీ
ABN, Publish Date - Apr 30 , 2024 | 12:49 AM
ముస్లింల సంక్షేమం, అభివృద్ధి టీడీపీకే సాధ్యమని, మత సామరస్యానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ అని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.
కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): ముస్లింల సంక్షేమం, అభివృద్ధి టీడీపీకే సాధ్యమని, మత సామరస్యానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ అని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఎమ్మిగనూరు పట్టణంలో ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డితో కలసి వివిధ వార్డుల్లో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రామానికి వెళ్లినా తనకు అనూహ్య స్పందన లభిస్తున్నదని అన్నారు. అనంతరం టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం చంద్రబాబు ముస్లిం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తే..సీఎం జగన్ వచ్చాక ముస్లిం మైనార్టీల సంక్షేమాన్ని సంక్షోభంలో నెట్టేశారని అన్నారు. జూన్ 4 తరువాత చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయడం తధ్యం అన్నారు.
Updated Date - Apr 30 , 2024 | 12:49 AM