ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీని ఇంటికి సాగనంపుదాం: శబరి

ABN, Publish Date - Apr 03 , 2024 | 11:49 PM

కలిసికట్టుగా కృషి చేసి వైసీపీని ఇంటికి సాగనంపాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు.

మాట్లాడుతున్న బైరెడ్డి శబరి

పాణ్యం, ఏప్రిల్‌ 3: కలిసికట్టుగా కృషి చేసి వైసీపీని ఇంటికి సాగనంపాలని నంద్యాల టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి పిలుపునిచ్చారు. బుధవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టీడీపి నాయకుల పరిచయ వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ సూపర్‌ సిక్స్‌ పథకాలతో ప్రజలకు భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కల్లూరు మండలంలో పందిపాడు గ్రామంలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసు స్టేసన్‌కు తీసుకువెళ్లి కొట్టడం అమానుషమని అన్నారు. పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత మాట్లాడుతూ పార్టీ శ్రేణులు మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్యే కాటసాని తాను, తన కార్యకర్తలు అక్రమంగా సంపాదించుకోవడినికే తప్ప నియోజవర్గాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ మాట్లాడుతూ దుర్మార్గుల పాలన నుంచి ప్రజలను కాపాడుకోవాలంటే టీడీపీని గెలిపించుకోవడమే మార్గమని అన్నారు. ఎంసీటీసీలు రంగరమేష్‌, భాస్కరరెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడుచింతా సురేష్‌బాబు, బీజేపీ నాయకులు శ్రీనివాసులు, టీడీపీ మండల అఽధ్యక్షులు గణపం జయరామిరెడ్డి, రమణ మూర్తి, ఖాదర్‌బాషా, రామ్మోహన్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు.

నేడు భూపనపాడుకు నారా భువనేశ్వరి

పాణ్యం: మండలంలోని భూపనపాడు గ్రామానికి నారా భువనేశ్వరి గురువారం విచ్చేస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్‌ తెలిపారు. గత ఏడాది అక్టోబరు 24న నారా చంద్రబాబు అరెస్టుకు తట్టుకోలేక గుండెపోటుతో మృతి చెందిన బొనిగెని శివరాముడు కుటుంబాన్ని ఆమె పరామర్శిస్తారని చెప్పారు.

Updated Date - Apr 03 , 2024 | 11:49 PM

Advertising
Advertising