ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల ప్రక్రియ విజయవంతం

ABN, Publish Date - Jun 11 , 2024 | 11:45 PM

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అత్యంత నైపుణ్య పద్ధతిలో శాంతియుతంగా, విజయవంతంగా పూర్తి చేశామని, దీనికి సహకరించిన అందరికీ అభినందనలని కలెక్టర్‌ డా.కె. శ్రీనివాసులు అన్నారు.

సహకరించిన వారందరికీ అభినందనలు

కలెక్టర్‌ డాక్టర్‌ కె.శ్రీనివాసులు

నంద్యాల కల్చరల్‌, జూన్‌ 11 : జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ అత్యంత నైపుణ్య పద్ధతిలో శాంతియుతంగా, విజయవంతంగా పూర్తి చేశామని, దీనికి సహకరించిన అందరికీ అభినందనలని కలెక్టర్‌ డా.కె. శ్రీనివాసులు అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో సార్వత్రిక ఎన్నికలు-2024 ప్రక్రియపై జాయింట్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌రెడ్డితో కలిసి జిల్లా అధికారులు, రిటర్నింగ్‌ అధికారులు, సంబంధిత సిబ్బందితో సక్సెస్‌ మీట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ డా.కె. శ్రీనివాసులు మాట్లాడుతూ ఓటర్ల జాబితాలోని తప్పొప్పులు మొదలుకొని కౌంటింగ్‌ ముగిసే వరకు సంబంధిత అధికారులందరి సమష్టి కృషితోనే ఎన్నికల ప్రక్రియ విజయవంతమైందన్నారు. ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొని తమ వంతు పాత్ర పోషించారన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నుండి వచ్చిన సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు సైతం విజయవంతంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంపట్ల ఆశ్చర్యచకితులయ్యారని కలెక్టర్‌ తెలిపారు. పోలీస్‌ యంత్రాంగం అవిరళ కృషిచేసిందని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి కలెక్టర్‌ కృతజ్ఞతులు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ డా.కె. శ్రీనివాసులును జిల్లా అధికారుల బృందం శాలువా కప్పి ఘనంగా సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Updated Date - Jun 11 , 2024 | 11:45 PM

Advertising
Advertising