అపరాల సాగుతో భూమి సారవంతం
ABN, Publish Date - Nov 13 , 2024 | 12:22 AM
అపరాల సాగుతో మినుము, పెసర, అలసంద సాగుతో భూమి సారవంత మవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు.
నంద్యాల రూరల్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి); అపరాల సాగుతో మినుము, పెసర, అలసంద సాగుతో భూమి సారవంత మవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ పేర్కొన్నారు. మంగళవారం ఏవో ప్రసాదరావు ఆద్వర్యంలో నంద్యాల మండలం చాబోలు, హైస్కూల్ కొట్టాల, గ్రామాల్లో పొలం పిలుస్తోంది నిర్వహించారు. డీఏవో మాట్లాడు తూ వరి కోత అనంతరం ఆపరాలను సాగుచే యాలని సూచించారు. రబీలో జొన్నకు కాండం తొలిచే పురుగు, కత్తెర పురుగు ఆశించిందని నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. వరికి డిసెంబర్ 31లోపు, మిగతా పంటలకు డిసెంబర్ 15 లోపు పంటల బీమా ప్రీమియం చెల్లించాల న్నారు. ఏఈవోలు ముక్తార్‌బాషా, మహేస్. నాగహర్షిత, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు
Updated Date - Nov 13 , 2024 | 12:22 AM