ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరి రైతు దగా

ABN, Publish Date - Nov 20 , 2024 | 12:07 AM

వరి రైతుకు ఫలితం దక్కడం లేదు. ధరలు ఘోరంగా పడిపోయాయి.

వరి ధాన్యాన్ని ఆరబెట్టిన రైతులు

ఆందోళనలో రైతులు ..

గిట్టుబాటు కాని వ్యవసాయం

జిల్లాలో 1,63,284 ఎకరాల్లో వరి

పంట సాగు

బస్తాకు రూ.450 రేటు తగ్గడంతో..

జిల్లాలో వరి రైతుకు 279.21

కోట్ల నష్టం

వరి రైతుకు ఫలితం దక్కడం లేదు. ధరలు ఘోరంగా పడిపోయాయి. సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు దగా పడుతున్నారు. తక్కువ ధరకు అమ్ముకొని నష్టాల పాలవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.

బనగానపల్లె/ రుద్రవరం, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లాలో 66 వేల హెక్టార్లకు పైగా వరిపంటను ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో రైతులు వరి పంటను సాగు చేశారు. బనగానపల్లె నియోజకవర్గంలో సుమారు 28.930 హెక్టార్లలో వరిపంట సాగు చేశారు బనగానపల్లె మండలంలో 9వేల హెక్టార్లలో, అవుకు మండలంలో 12వేల హెక్టార్లలో, కోవెలకుంట్ల మండలంలో 3700 హెక్టార్లలో, సంజామల మండలంలో 3430 హెక్టార్లలో, కొలిమిగుండ్ల మండలంలో 800 హెక్టార్లలో వరి పంటను సాగు చేశారు.

గిట్టుబాటు ధర ఏది?

రైతులు వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదని బెంబేలెత్తిపోతున్నారు. ఒక్కో ఎకరాకు సుమారు కౌలు, ఎరువులు, పురుగుమందులు, కలుపు కూలీలు, వరినాటు కూలీలు. సేద్యపు ఖర్చులు కలుపుకొని రూ.50వేలు పెట్టుబడి పెట్టారు. దిగుబడి చూస్తే 38బస్తాలే వచ్చాయి. కానీ రేటు 77 కేజీల బస్తా రూ.1550 పలికింది. గిట్టుబాటు ధర లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే వ్యవసాయానికి స్వస్తి పలకాల్సిందే అని వాపోయారు.

గత ఏడాది 77 కేజీల వరి ఽధాన్యం బస్తా రూ.2వేలు

గత ఏడాది వరి ధాన్యం 77 కేజీల బస్తా రూ.2వేలకు అమ్మినట్లు రైతులు తెలిపారు. కానీ ఈసారి రూ.1550 వరి ధాన్యం బస్తా రేటు పలికింది. ఒక్కో బస్తాపై రూ.450 నష్టపోవాల్సి వచ్చింది. రైతు కష్టం నేలపాలైందే తప్ప ఈ సారి గిట్టుబాటు ధర కల్పించడంలో నష్టపోవాల్సివచ్చిందని రైతులు వాపోయారు.

జిల్లాలో వరి రైతుకు రూ.279.21 కోట్లు నష్టం

జిల్లాలో ఎకరాకు 38బస్తాలు దిగుబడి వస్తుంది. కానీ ఒక బస్తాకు రూ.450 రేటు తగ్గింది. గత ఏడాది ఒక బస్తా వరి ధాన్యం రూ.2వేలు రేటు పలికింది. ఈసారి బస్తా ధాన్యం రూ.1550 రేటు పలుకుతుంది. జిల్లాలో 1,63,285 ఎకరాల్లో 38బస్తాలు సగటున 62,04,792 బస్తాల దిగుబడి అంచనా. ఒక బస్తాకు రూ.450 చొప్పున రూ.62,04,792 బస్తాలకు నష్టం రూ.279.21,56,400 ఈసారి ఖరీఫ్‌ రైతులకు వరిధాన్యంపై నష్టపోయారు.

పెరిగిన పెట్టుబడి ఖర్చులు: ఇటీవల వ్యవసాయ కూలీలు, రసాయన ఎరువులు, సేద్యపు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. హెక్టారుకు సుమారు రూ.50వేల వరకు ఖర్చు వస్తోంది. కౌలు రైతులకు మరో రూ.35 వేలు అధికం అవుతోంది. సేద్యపు ఖర్చులు, రసాయనిక ఎరువులు, పురుగుల మందులు ధరలు విపరీతంగా పెరిగాయి. కూలీలు సమయానికి దొరకకపోవడంతో రైతులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వాటితోపాటు అకాల వర్షాలు రైతులను వెంటాడుతూ వచ్చాయి. పంట అమ్మేంత వరకు రైతులు వడ్లను ఆరబోసి వ్యాపారులకు అమ్మే వరకు, లేదా గోదాములకు తరలించేంత వరకు భయం భయంగా రైతులు కాలం వెళ్ల్లదీస్తున్నారు.

ఈ ఏడాది వివిధ రకాల తెగుళ్లు వరి పంటను ఆశ్రయించాయి. ఈ తెగుళ్ల బారినుంచి రక్షించుకోవడానికి భారీగా పురుగులు మందులు వాడారు. ఎండు తెగుళ్లు, అగ్గి తెగుళ్లు, కాటుక తెగుళ్లు సోకాయి. అగ్గి తెగుళ్లు కూడా విజృంభించాయి. ఈ తెగుళ్లు వరి మొక్క ఆకులు, మెడభాగం, కణుపులు, చివరి భాగాలను ఎక్కువగా ఆశించింది. అధిక వర్షాలకు తోడు నేలలో సరిపడా తేమ ఉండకపోవడంతో ఈ తెగులు వ్యాపించిందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. ఆకుమచ్చ తెగులు పిలక దశ నుంచి పొట్ట దశ వరకు వ్యాపించడంతో రైతులు వివిధ రకాల పురుగుల మంద్రు స్ర్పే చేసి పంటను సంరక్షించుకున్నారు. ఇందుకు భారీగా ఖర్చు చేశారు. అలాగే మచ్చతెగులు, కాటుక తెగుళ్ళు కూడా ఈ ఏడాది భారీగా ఆశించడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు.

గిట్టుబాటు ధర కల్పించాలి

వరిధాన్యానికి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. ప్రస్తుతం క్వింటాలుకు కేవలం రూ.1750 ఉంది. ఈ ధరను రూ.2 వేలుకు పెంచాలి. ధరలు పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం.

-చంద్రశేఖర్‌రెడ్డి, యాగంటిపల్లె రైతు

జాతీయ ఉపాధి పథకాన్ని అనుసఽంధానం చేయాలి

జాతీయ ఉపాధి పథకాన్ని వ్యవసాయానికి అనుసఽంధానం చేసి రైతులను ఆదుకోవాలి. పెట్టుబడి సాయం అందించాలి. రసాయనిక, పురుగు మందుల రేట్లు తగ్గించాలి. వరిధాన్యం మద్దతు ధరలు పెంచి రైతులను ఆదుకోవాలి.

-బంది రవీంద్రనాథరెడ్డి, యాగంటిపల్లె, రైతు

గత ఏడాది బస్తా ధాన్యం రూ.2వేలకు విక్రయించా

గత ఏడాది వరి ధాన్యం బస్తా రూ.2వేలకు విక్రయించా. ఈ ఏడాది 12 ఎకరాల్లో వరి సాగు చేశా. వరి ధాన్యం బస్తా రేటు రూ.1550 పలికింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఒక బస్తాకు రూ.450 నష్టపోయాం.

-సుబ్బారావు, రైతు, చిత్తరేణిపల్లె

గిట్టుబాటు ధర లేదు

వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు. 77 కేజీల బస్తా రూ.1550 మాత్రమే రేటు పలికింది. ఈసారి కౌలుకు తీసుకుని 17 ఎకరాలు వరి పంట సాగు చేశా. పెట్టుబడి, కౌలు కలిపి ఒక్కో ఎకరాకు 50వేలు ఖర్చు వచ్చింది. దిగుబడి 38 బస్తాలు వచ్చాయి.

-రామలింగం, రైతు, చిత్తరేణిపల్లె

రైతు కష్టానికి ఫలితం లేదు

వరి రైతుకు కష్టం పుడమిపాలైంది. ఈసారి గిట్టుబాటు ధర లేదు. గత ఏడాది వరి ధాన్యం బస్తా రూ.2వేలు రేటు పలికింది. ఈ ఏడాది రూ.1550 మాత్రమే రేటు పలుకుతున్నది. దీంతో రైతు నష్టపోవాల్సి వచ్చింది.

-మాధవ, రైతు, చిత్తరేణిపల్లె

పంట దిగుబడి తగ్గింది

సాధారణంగా 40 నుంచి 48బస్తాలు దిగుబడి రావాల్సి ఉంది. ఈసారి ఎకరాకు 38 బస్తాలే దిగుబడి వచ్చింది. గిట్టుబాటు ధర కూడా లేదు. వరి ధాన్యం ఈసారి రైతును నట్టేట ముంచింది.

-రామక్రిష్ణ, రైతు, చిత్తరేణిపల్లె

Updated Date - Nov 20 , 2024 | 12:07 AM