ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

ABN, Publish Date - Oct 22 , 2024 | 12:23 AM

విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని, వారు చేసిన త్యా గాలు, సేవలు మరువలేనివని జిల్లా ప్రధాన న్యాయాధి కారి జి.కబర్ది అన్నారు.

పోలీసు అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తున్న జిల్లా ప్రధాన న్యాయాధికారి కబర్ది, కలెక్టర్‌, ఎస్పీ

పోలీసు అమరవీరుల స్థూపానికి నివాళి

కర్నూలు క్రైం, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం అందరి బాధ్యత అని, వారు చేసిన త్యా గాలు, సేవలు మరువలేనివని జిల్లా ప్రధాన న్యాయాధి కారి జి.కబర్ది అన్నారు. సోమవారం పోలీసు అమరవీరుల సంస్మ రణ దినం సందర్భంగా స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయం లోని పరేడ్‌ మైదానంలో అమరవీరుల స్థూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయాధికారితోపాటు కలెక్టర్‌ పి.రంజిత్‌ బాషా, ఎస్పీ బిం దు మాధవ్‌, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జాయిం ట్‌ కలెక్టర్‌ డా.బి.నవ్య, హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం అమరవీరుల స్థూపానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యా యాధికారి జి.కబర్ది మాట్లాడుతూ మనకు రక్షణ కల్పిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారుల దైర్యసాహాసాలు, దేశభక్తి, విధేయతలను గుర్తుంచుకుని గౌరవించాలన్నారు. దేశభద్రత కోసం రాత్రి, పగలు తేడా లేకుండా విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో 24 గంటలు పని చేయాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఫైర్‌, ఏదైనా ప్రాణనష్టం జరిగినప్పుడు వెంటనే స్పందించేది పోలీసులేనని తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ అమర వీరులను ఆదర్శంగా తీసుకొని పోలీసు అమరవీరుల కుటుం బాలకు అండగా ఉంటున్నామన్నారు. జిల్లా ప్రజల సంక్షే మమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అనం తరం అమరవీరుల కుటుంబాల సభ్యులను కలెక్టర్‌, న్యాయాధికారి, ఎస్పీ శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్‌ సదరన్‌ రిజియన్‌ ఎం.మహేష్‌ కుమార్‌, ఏఆర్‌ అడిషినల్‌ ఎస్పీ కృష్ణమోహన్‌, డీఎస్పీలు బాబుప్రసాద్‌, శ్రీనివాసాచారి, శ్రీనివాసరావు, పోలీసు వెల్ఫేర్‌ డాక్టర్‌ స్రవంతి, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2024 | 12:23 AM