ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇసుక తోడేస్తున్నారు

ABN, Publish Date - Nov 27 , 2024 | 11:11 PM

మంత్రాలయం వద్ద తుంగభద్ర ఒట్టిపోతోంది. నిత్యం ఇసుకను అక్రమంగా తరలించుకపోతున్నారు.

మంత్రాలయం వద్ద తుంగభద్రలో ఇసుక నింపుకుంటున్న ట్రాక్టర్లు

రూ.వేలల్లో ఇసుక దందా

నేతల అండదండలతో అక్రమ రవాణా

పట్టించుకోని అధికారులు

మంత్రాలయం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం వద్ద తుంగభద్ర ఒట్టిపోతోంది. నిత్యం ఇసుకను అక్రమంగా తరలించుకపోతున్నారు. ఒక్కో ట్రాక్టరు ఇసుక రూ.2వేల నుంచి రూ.3వేలకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. నాయకుల అండతో పోలీస్‌స్టేషన్‌, రెవెన్యూ కార్యాలయాల ముందు నుంచి ప్రధాన రహదారుల గుండా విచ్చలవిడిగా ఇసుక ట్రాక్టరు వెళ్లిపోతున్నాయి. ఇసుకాసురులు పగలు, రాత్రి తేడా లేకుండా తుంగభద్రను తోడేసి గుంతలమయం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామానికి సమీపంలోని వంక, వాగు, నది నుంచి ఎద్దులబండ్లు, ట్రాక్టర్లతో ఇళ్ల నిర్మాణాల కోసం మాత్రమే ఇసుకను తీసికెళ్లాలి. ఇక్కడ మాత్రం ఇసుకతో వ్యాపారం చేస్తూ లక్షల రూపాయలు గడిస్తున్నారు. వీటిపైన రెవెన్యూ, భూగర్భజలాలు, పోలీసు శాఖలు తమకు సంబంధం లేదన్నట్లు ప్రవర్తిస్తున్నాయి. మంత్రాలయం నుంచి సూగూరు, చెట్నహల్లి, చిలకలడోన, కల్లుదేవకుంట, సూగూరు, బూదూరు, ఎమ్మిగనూరుకు సైతం ఇసుకను తరలిస్తున్నారు. మంత్రాలయానికి చెందిన ట్రాక్టర్లకే గాక ఇతర ట్రాక్టర్లు సైతం అధికార పార్టీకి చెందిన నాయకులు లీజుకు తీసుకుని మరింత అక్రమ ఇసుకను రవాణా చేయడం విశేషం. స్థానిక పంచాయతీ సెక్రటరీ అనుమతితో ఉచిత ఇసుక రవాణా చేస్తున్నట్లు పైకి కనిపిస్తున్నప్పటికీ ఈ పేరుతో తుంగభద్ర నది తీరంలోని ఇసుకను ఖాళీ చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం, ఇసుకలో నాయకుల పాత్ర ఉంటే ఉపేక్షించేది లేదని స్పష్టంగా అంటున్నప్పటికీ ఇక్కడి నాయకులు పట్టించుకోకుండా ఒక్కో లాడ్జీ ముందు వందలాది ట్రాక్టర్ల ఇసుకను డంప్‌ చేస్తూ విక్రయిస్తున్నారు. లాడ్జీ నిర్మాణాల్లో బెస్‌మెంట్‌ ఎత్తుగా నిర్మించి అందులో గ్రావెల్‌ నింపాల్సి ఉండగా.. రాత్రికిరాత్రే ఇసుకతోనే నింపేస్తుండటం చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో ఉచిత ఇసుక అందేది కాదు.. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుకను ఉచితం చేయడంతో గతంలో ఇబ్బంది పడిన ఇసుకాసురులు ఇదే అదునుగా ఇసుకును నిల్వ చేసి మూడు పూవులు ఆరు కాయలుగా రోజుకు వేలాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. మా నాయకులు చెప్పారు.. మేము చేసుకుంటాం.. వైసీపీ హయాంలో వారు చేసుకున్నారు.. ఇప్పుడు మేం చేస్తే తప్పా అని బెదిరిస్తున్నారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాల్సిన మైనింగ్‌, రెవెన్యూ, పోలీసు యంత్రాంగం కళ్లు ఎదురుగా వందలాది ట్రాక్టర్లు తిరుగుతున్నా వీరికి ముడుపులు ఇచ్చుకోవడంతో పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఇసుక రవాణాను అరికట్టాలని కాలనీవాసులు, ప్రజలు కోరుతున్నారు.

అనుమతులు ఉంటేనే ఇసుక.. లేదంటే సీజ్‌ చేస్తాం

మంత్రాలయం గ్రామ పరిధిలో ఇసుక కావాలంటే పంచాయతీ కార్యదర్శితో అనుమతులు పొంది నది, వాగు, వంకల్లో నుంచి ఇసుకను తోడుకోవాలి. అనుమతి లేకుండా నదిలోని ఇసుకను రవాణా చేస్తే చర్యలు తీసుకుని సీజ్‌ చేస్తాం. ఇళ్లు కట్టుకొనేవారు తమ ఇళ్లవద్ద 1 లేదా 2 ట్రాక్టర్ల ఇసుకను మాత్రమే నిల్వ ఉంచుకోవాలి.

- ఎస్‌.రవి, తహసీల్దార్‌, మంత్రాలయం

అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం

మంత్రాలయంలో ఇసుక రవాణాపై ఎంపీడీవో, తహసీల్దార్‌, మైనింగ్‌ అధికారులతో సంప్రదించి మైనింగ్‌, రెవెన్యూ, ఎంపీడీవోలతో సమావేశమై అక్రమ ఇసుకను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటాం. ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే చర్యలు తప్పవు.

- రామాంజులు, సీఐ, మంత్రాలయం

Updated Date - Nov 27 , 2024 | 11:11 PM