ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

దళిత మహిళపై దాడి చేసిన వారిని శిక్షించాలి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:19 AM

పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవింద మ్మపై దాడి చేసినవారిని, సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

బాధితురాలిని పరామర్శిస్తున్న సీపీఎం నాయకులు

- సీపీఎం జిల్లా అధ్యక్షుడు గౌస్‌దేశాయి

ఎమ్మిగనూరు, సెప్టెంబరు 15: పెద్దకడుబూరు మండలం కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవింద మ్మపై దాడి చేసినవారిని, సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గౌస్‌ దేశాయ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం నాయకులు గౌస్‌దేశాయ్‌, రాధాకృష్ణ, గోవిందు, నారాయణ, డీవైఎఫ్‌ఐ సురేష్‌ కుమార్‌ ఆసుపత్రిలో బాధితురాలిని పరామర్శిం చారు. సభ్యసమాజం తలదించుకునేలా దళిత మహిళపై దాడిచేయటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు చేయాలని, దాడి వెనుక ఎవరున్నా వదిపెట్టవద్నన్నారు. పోలీసులు గ్రామానికి చేరుకొని బాధితురాలిని రక్షించినందుకు అభినం దించారు. ఎస్పీ, డీఎస్పీ గ్రామాన్ని సందర్శించాలని కోరారు. రాముడు, లక్ష్మినరసయ్య, అబ్దుల్లా, వెంకటేశ్‌ శెట్టి, పెద్దకడుబూరు తిక్కన్నగౌడ్‌, పరమేష్‌ పాల్గొన్నారు.

మానవ హక్కుల వేదిక నాయకుల పరామర్శ

ఎమ్మిగనూరు టౌన్‌ : బాధితురాలు గోవిందమ్మను మానవ హక్కుల వేదిక నాయకులు పరామర్శించారు. యూజీ శ్రీనివాసులు, దేవేంద్రబాబు, మాలమహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసన్న తిక్కయ్య, తస్లిమా, సూర్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:19 AM

Advertising
Advertising