రేపు జాతీయ క్రీడా దినోత్సవం
ABN, Publish Date - Aug 28 , 2024 | 12:21 AM
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు.
హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతిని పురస్కరించుకొని వేడుకలు
కర్నూలు(స్పోర్ట్స్), ఆగస్టు 27: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా గురువారం జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు. కర్నూలు జిల్లాలో క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజేతలకు కలెక్టర్, ఎస్పీ, మంత్రులు సన్మానించి నగదు పురస్కారాలు, జ్ఞాపికలు ఇచ్చి గౌరవిస్తారు. జిల్లాలో వా రం రోజుల పాటు అంతర్‌పాఠశాలల బాలబాలికలకు పోటీలు నిర్వహించి ఈ నెల 29న విజేతలకు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేసి సత్కరి స్తామని జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి తెలిపారు. అలాగే గత సంవత్సరం డీఎస్‌ఏ స్టేడియంలో మేజర్ ధ్యానచంద్ కాంస్య విగ్రహం ఆవిష్కరించామని క్రీడల అభివృద్ధి అధికారి తెలిపారు.
క్రీడాకారులను సత్కరిస్తాం
జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో ప్రతిభ చా టిన జిల్లా క్రీడాకారులను ట్రాక్ షూట్, శాలువ, జ్ఞాపికతో సత్కరిస్తాం. హాకీ క్రీడతో పాటు ఇతర క్రీడలను ప్రభుత్వం ప్రోత్సహించి కర్నూలు జిల్లా క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి.
- భూపతిరావు, క్రీడల అభివృద్ధి అధికారి
ధ్యానచంద్ సేవలు చిరస్మరణీయం
భారత హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసు కుంటూ ప్రభుత్వం కార్యక్రమాలు ఏర్పాటు చేయడం హర్షణీయం. ఆయన స్ఫూర్తితో జిల్లాలో హాకీ క్రీడా భివృద్ధికి కృషి చేస్తాం.
- దాసరి సుధీర్, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి
Updated Date - Aug 28 , 2024 | 12:22 AM