ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయాలి
ABN, Publish Date - Aug 28 , 2024 | 12:59 AM
ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయా లని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన నాయకులు ప్రభు త్వాన్ని కోరారు.
కర్నూలు(కల్చరల్), ఆగస్టు 27: ఉద్యోగుల బదిలీలు వాయిదా వేయా లని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన నాయకులు ప్రభు త్వాన్ని కోరారు. నగరంలో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయం ముందు మంగళవారం ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన జిల్లా అధ్యక్షుడు దశరఽథ రఘురామిరెడ్డి, కార్యదర్శి అబ్దుల్ సాహెబ్‌లు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉత్తర్వులకు భిన్నంగా జరిగిన ఉద్యోగుల బదిలీలను రద్దు చేస్తూ, సదరు సిబ్బందిని వారి సొంత యూనిట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ స్థానాలకు బదిలీలు చేసి, తిరిగి సర్కిల్ వ్యవస్థను పూర్వపు స్థితికి తీసుకురావాలని కోరారు. జీఎస్‌టీఓలకు సరైన వర్క్ ఫంక్షన్స ఏర్పాటు చేయాలని, రీజనల్ ఆఫీసులు రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన ఉపా ధ్యక్షులు మురళీకృష్ణ, డి.చంద్రశేఖర్, పి. రమేష్‌బాబు, పాణిగ్రాహి, రాష్ట్ర ఈసీ సభ్యుడు సిద్దిక్, మహిళా కార్యవర్గ సభ్యులు టి. మహాలక్ష్మి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Aug 28 , 2024 | 12:59 AM