ఎక్సైజ్ బదిలీల్లో పైరవీలు
ABN, Publish Date - Oct 02 , 2024 | 12:16 AM
ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరి గిన బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయంటూ కొందరు కానిస్టేబుళ్లు రోడ్డెక్కారు.
సెబ్‌లో కష్టపడ్డాం.. మళ్లీ ఎందుకీ వివక్ష అంటూ ఆవేదన
కర్నూలు(అర్బన్), అక్టోబరు 1: ఎక్సైజ్ శాఖలో ఇటీవల జరి గిన బదిలీల్లో పెద్ద ఎత్తున పైరవీలు జరిగాయంటూ కొందరు కానిస్టేబుళ్లు రోడ్డెక్కారు. ఓ అధికారి అన్నీ తానై వ్యవహరించి గతంలో ఎక్సైజ్‌లో విభాగంలో పని చేసిన వారికే ప్రాధాన్యత కల్పించి స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో విభాగంలో పని చేసిన వారి పట్ల వివక్ష చూపుతున్నారని మండిపడుతున్నారు. ఇటీవల ఉమ్మడి కర్నూలు జిల్లాలో 136 మంది కానిస్టేబుళ్లు, సీఐలు, హెడ్ కానిస్టేబుళ్లకు బదిలీలు జరిగాయి. మార్గదర్శకాలను పక్కన పెట్టి కౌన్సెలింగ్, యాప్షన్‌లతో సంబం ధం లేకుండా బదిలీలు చేయడం వివాదా స్పదంగా మారింది. పైరవీలు చేసిన వారికి ప్రాధాన్యం కల్పించడం పట్ల కొందరు కానిస్టేబుళ్ల బహిరంగంగానే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బదిలీల్లో పైరవీలు సాగాయి ఇలా..
జిల్లా కేంద్రంలోని డిప్యూటీ కమిష నర్ కాంపౌండ్‌లో డీటీఎఫ్, లోకల్ స్టేషన్, ఏసీ కార్యాలయం, టీఎఫ్‌టీ స్క్వాడ్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో పని చేసిన కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, సీఐలకు స్థాన చలనం కల్పించకుండా షఫిలింగ్ చేస్తూ అక్కడే పోస్టింగ్ ఇచ్చారనే అరోపణలు ఉన్నాయి. కోడుమూరులో పని చేసిన ఓ హెడ్ కానిస్టేబుల్ గుండె జబ్బు, పక్షవాతంతో బాధపడుతున్నప్పటికీ ఆయన్ను జిల్లా సరిహద్దులోని హొళగుందకు బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. పలువురు మహిళా కానిస్టేబుల్స్‌ను కూడా ఇష్టానుసారంగా సరిహద్దు స్టేషన్స్, చెక్ పోస్టులకు బదిలీ చేయడం పట్ల కానిస్టేబుళ్లు తమ గోడు విన్నవించుకునేందుకు అధికారుల కోసం పడిగాపులు కాస్తూ కనిపించారు. కర్నూలు జిల్లాలో పని చేస్తున్న 15 మంది, నంద్యాల జిల్లాలో పని చేస్తున్న పది మందిని జిల్లాలు మార్చుతూ బదిలీ చేశారు. ఏ జిల్లావారిని ఆ జిల్లాకు పంపకుండా నంద్యాల జిల్లాకు చెందిన కానిస్టేబుల్‌ను కర్నూలు జిల్లాలోని హొళగుంద చెక్ పోస్టుకు, కోసిగి, నందవరం లాంటి మారు మూల ప్రాంతాలకు ఎలా బదిలీ చేస్తారంటూ కానిస్టేబుళ్లు అధికారుల వద్ద వాపోయారు.
మెట్లు ఎక్కితే సస్పెండ్ చేస్తా..
‘బదిలీలు చేశాం. వెళ్లి జాయిన్ కావాల్సిందే.. లేదంటే సస్పెండ్ చేస్తానంటూ’ తమను అధికారి బెదిరిస్తున్నారంటూ కానిస్టేబుళ్లు డిప్యూటీ కమిషనర్ కోసం కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తూ కనిపించారు. డిప్యూటీ కమిషనర్ సీఎం చంద్రబాబు పర్యటన కోసం పత్తికొండ వెళ్లారని, బదిలీ అయిన స్టేషన్స్‌లో డ్యూటీకి వెళ్లాలని సదరు అధికారి కార్యాలయ సిబ్బంది బాధిత కానిస్టేబుళ్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
కోరిన స్టేషన్లు కావాలంటే ఎలా?
అందరికీ కోరిన స్టేషన్స్ కావాలంటే ఎలా.? బదిలీ చేసిన స్టేషన్‌కు వెళ్లాల్సిందే. అందరికీ న్యాయం చేయలేం. అంత మాత్రాన ఏదో జరిగిపోయిందంటే ఎలా..?
- ఎం. శ్రీదేవి, డిప్యూటీ కమిషనర్
Updated Date - Oct 02 , 2024 | 12:16 AM