ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కరిగించేస్తున్నారు

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:12 AM

మండలంలోని కొండాపురం కొండలు కరుగుతున్నాయి. గత వైసీపీ పాలనలో ఇప్పటికే కొండలు ఉనికి కోల్పోయాయి. అయితే తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు కూటమి ప్రభుత్వం టీడీపీ కన్ను కొండపై పడింది.

ఇష్టారాజ్యంగా తవ్వేయడంతో ఆనవాళ్లు కోల్పోతున్న కొండ

కొండాపురం కొండలను తవ్వేస్తున్న అక్రమార్కులు

కూటమి నాయకులు కావడంతో చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు

కనుమరుగవుతున్న గ్రావెల్‌

ఆదోని, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొండాపురం కొండలు కరుగుతున్నాయి. గత వైసీపీ పాలనలో ఇప్పటికే కొండలు ఉనికి కోల్పోయాయి. అయితే తామేమీ తక్కువ తిన్నామా అన్నట్లు కూటమి ప్రభుత్వం టీడీపీ కన్ను కొండపై పడింది. ఇంకేముంది రోజూ కొండను తవ్వి, గ్రావెల్‌ను భారీ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలింపు

కొండను తవ్వి గ్రావెల్‌ ట్రాక్టర్లు, టిప్లర్లలో నింపి తరలించేస్తున్నారు. పట్టణంలోని పరిశ్రమలకు తరలించి సొమ్ము చేసుకుం టున్నారు. ప్రభుత్వానికి రూ.లక్షల్లో చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొడుతున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్‌ అధికా రులు పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఉన్న రెవెన్యూ శాఖ అధికారులు తూతూ మంత్రంగా దాడులు జరిపి మమ అనిపించేశారు.

నెలవారి మామూళ్లు

అక్రమార్కుల నుంచి పోలీసులు, రెవెన్యూ అధికారులకు నెలవారి మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణ లున్నాయి. అందుకే వారు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని చర్చ సాగుతోంది.

ఎవరినీ ఉపేక్షించం

కొండాపురం కొండలను పరిశీ లిస్తాం. అక్రమంగా గ్రావెల్‌ను తరలిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించం, కేసు నమోదు చేస్తాం. -శివరాముడు, తహసీల్దార్‌, ఆదోని.

Updated Date - Nov 18 , 2024 | 12:12 AM