ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రామాభివృద్ధికి తోడ్పాటునందించాలి: ఎమ్మెల్యే

ABN, Publish Date - Nov 24 , 2024 | 01:02 AM

గ్రామాభి వృద్ధికి అందరూ తమవంతుగా తోడ్పాటునందించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

నందికొట్కూరులో మాట్లాడుతున్న ఎమ్మెల్యే జయసూర్య

నందికొట్కూరు రూరల్‌, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): గ్రామాభి వృద్ధికి అందరూ తమవంతుగా తోడ్పాటునందించాలని నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. శనివారం నందికొట్కూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి గ్రామస్థాయిలో సచివాలయ సిబ్బంది, మండల స్థాయిలో అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో వీధుల్లో తిరిగి ఎక్కడ ప్రజా జీవనానికి అవసరమైన రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్‌, మౌలిక వసతులు కలించాలని సూచించారు. అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీని వాసులు, ఎంపీపీ మురళీకృష్ణారెడ్డి. అధికారులు నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 01:02 AM