సకాలంలో చెరువులు నింపుతాం
ABN, Publish Date - Nov 29 , 2024 | 11:29 PM
హంద్రీనీవా కాలువ ద్వారా సకాలంలో 77 చెరువులను నింపుతామని జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బి. బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు.
కర్నూలు, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువ ద్వారా సకాలంలో 77 చెరువులను నింపుతామని జలవనరుల శాఖ కర్నూలు సర్కిల్ ఎస్‌ఈ బి. బాలచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కృష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద నిర్మించిన పంప్‌హౌస్‌ను పరిశీలించారు. డిస్ట్రిబ్యూటరీ పాయింట్‌ను తనిఖీ చేశారు. ఈ నెల 26న జరిగిన ఐఏబీ సమావేశంలో కర్నూలు జిల్లాలో ఉన్న 42 చెరువులకు తక్షణమే హంద్రీనీవా కాలువ ద్వారా నీటిని నింపాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటి వరకు పత్తికొండ, డోన్ నియోజకవర్గాల్లో 63 చెరువులు పూర్తిగా, పాక్షికంగా నింపితే.. కర్నూలు జిల్లాలో కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, కల్లూరు మండలాల్లో 42 చెరువులకు గానూ 15 చెరువులు పూర్తి స్థాయిలో, 14 చెరువులు పాక్షికంగా నింపినట్లు ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. త్వరలోనే అన్ని చెరువులను నింపుతామని తెలిపారు. ఎస్‌ఈ వెంట ఎఫ్‌ఆర్‌ఎల్ డివిజన్ డీఈఈలు రామకృష్ణ, శ్రీనివాస నాయక్, కోయా కంపెనీ ప్రతినిధులు ఉన్నారు.
Updated Date - Nov 29 , 2024 | 11:29 PM