ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షోభంలోనూ సంక్షేమం

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:46 PM

ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు.

గుళ్లదుర్తిలో మాట్లాడుతున్న మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

చంద్రబాబుది ఆదర్శవంతమైన పాలన

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కోవెలకుంట్ల, సెప్టెంబరు 20: ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కోవెలకుంట్ల మండల పరిధి లోని గుళ్లదుర్తి గ్రామంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రజా వేదిక సమస్యల పరి ష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీతో పాటు కలెక్టర్‌ రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ మాట్లాడుతూ గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు. ప్రస్తుతం తాను మంత్రి కావడంతో రాష్ట్రంలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయడం వల్ల నియోజకవర్గ ప్రజలకు కొంత మేర దూరమవుతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అయినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని వాటి మరమ్మతులకు రూ.530 కోట్లు ఖర్చవుతుందని అందుకోసం మంత్రి నిధుల మంజూరుకు కృషి చేస్తున్నారన్నారు. ఇప్పటికే రూ.2.6 కోట్లు నిధులు మంజూరైనట్లు తెలిపారు. అనంతరం గుళ్లదుర్తి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ప్రజల నుంచి మంత్రి, కలెక్టర్లు ఫిర్యాదులు స్వీకరించారు.

Updated Date - Sep 20 , 2024 | 11:46 PM